ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో పనస పండ్లు కూడా ఒకటి. ఇవి అనేక ఔషధ విలువలను, పోషకాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మన దేశంలో ఎక్కడ చూసినా ఈ పండ్లు మనకు విరివిగా లభిస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
పనస పండ్లలో విటమిన్ ఎ, సి, థయామిన్, నియాసిన్, రైబో ఫ్లేవిన్, కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్, సోడియం, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అలాగే వీటిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు యాంటీ క్యాన్సర్, యాంటీ హైపర్ టెన్సివ్, యాంటీ అల్సర్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. వీటితోపాటు ఎన్నో మినరల్స్, ఫైబర్, ప్రోటీన్లు కూడా ఈ పండ్లలో ఉంటాయి. పనస పండ్లలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే రోగ నిరోధక శక్తికి బలం చేకూరుతుంది. 100 గ్రాముల పనస పండ్లను తింటే మనకు 94 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పండ్లలో ప్రోటీన్లు అద్భుతంగా ఉంటాయి. మనకు కావల్సినంత శక్తి లభిస్తుంది. కనుక వీటిని అస్సలు మిస్ చేయకుండా తినాల్సిందే.
పనస పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, విటమిన్ సి పలు క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా లంగ్స్, బ్రెస్ట్, గ్యాస్ట్రిక్, స్కిన్, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. శరీరంలోని కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
అధిక బరువును తగ్గించుకునేందుకు పనస పండ్లు ఉపయోగపడతాయి. వీటిల్లో కొవ్వు ఉండదు. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఈ క్రమంలో బరువును తగ్గించుకోవచ్చు.
పనస పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల హైబీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్, ఇతర గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
పనస పండ్లలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్దకం ఉండదు. పెద్ద పేగులో పేరుకుపోయే కార్సినోజెనిక్ కెమికల్స్ బయటకు వెళ్లిపోతాయి.
పనస పండ్లలో ఉండే మెగ్నిషియం, ఐరన్‌లు నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి. నిద్ర బాగా వస్తుంది. తరచూ ఈ పండ్లను తింటే నిద్రలేమి సమస్య ఉండదు.
పనస పండ్లు తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ డయాబెటిస్ ఉన్నవారు వీటిని నిర్భయంగా తినవచ్చు. ఎందుకంటే ఈ పండ్ల ద్వారా విడుదలయ్యే చక్కెర రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా ఈ పండ్లను తినవచ్చు.
పనస పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. శుక్లాలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మం సంరక్షించబడుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. యవ్వనంగా ఉండవచ్చు. చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.
పనస పండ్లలో యాంటీ అల్సరేటివ్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల అల్సర్లు తగ్గుతాయి. తరచూ ఈ పండ్లను తింటే ప్రయోజనం ఉంటుంది.
పనస పండ్లలో ఉండే కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల ఈ పండ్లను తరచూ తీసుకోవాలి. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి, మెగ్నిషియంలు మనం తినే ఆహారంలో ఉండే కాల్షియాన్ని శరీరం ఎక్కువగా శోషించుకునేలా చేస్తాయి. దీంతో కాల్షియం లోపం రాదు. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
పనస పండ్లలో ఉండే థయామిన్, నియాసిన్‌లు శరీరానికి శక్తిని అందిస్తాయి. నాడీ మండల వ్యవస్థకు బలాన్నిస్తాయి. దీని వల్ల ఒత్తిడి, కండరాల బలహీనతలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365