Salt : ఉప్పును ఎక్కువ‌గా తింటే ఏ అయ‌వానికి ఎంత న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

Salt : ఉప్పు మ‌న ఆహారంలో ఒక భాగ‌మైపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకు రావ‌డంలో ఉప్పు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఉప్పు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. శ‌రీరంలో నీరు త‌గినంత ఉండేలా చేయ‌డంలో, న‌రాలు మ‌రియు కండ‌రాల ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, శరీరంలో ఎల‌క్ట్రోలైట్స్ ను స‌మ‌తుల్యం చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఉప్పు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఉప్పు మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని త‌గిన మోతాదులోనే తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని వివిధ దుష్ప్రభావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు మ‌న శ‌రీరంపై ఏవిధంగా చెడు ప్ర‌భావాల‌ను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు పెరుగుతుంది. ఉప్పులో ఉండే సోడియం శ‌రీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది. దీంతో ర‌క్త ప‌రిమాణం పెరిగి ర‌క్త‌నాళాల‌పై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంది. ఇది క్ర‌మంగా ర‌క్త‌పోటుకు దారి తీస్తుంది. అంతేకాకుండా అధికంగా ఉండే ర‌క్తపోటు గుండె ఆరోగ్యంపై కూడా తీవ్రమైన చెడు ప్ర‌భావాన్ని చూపిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే అధికంగా తీసుకునే ఈ ఉప్పు మూత్ర‌పిండాల‌పై కూడా తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటుంది.

here it is how too much salt effects you body
Salt

అంతేకాకుండా ఉప్పును అధికంగా తీసుకోవ‌డం వల్ల జ్ఞాప‌క‌శ‌క్తి కూడా త‌గ్గుతుంది. మెద‌డుకు సంబంధించిన స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడాఉంది. అలాగే కంటిచూపు కూడా త‌గ్గుతుంది. దృష్టి లోపాల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఉప్పును తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకల ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే క్యాల్షియం మూత్రం ద్వారా బ‌య‌ట‌కు ఎక్కువ‌గా విస‌ర్జించ‌బ‌డుతుంది. దీంతో ఎముక‌ల సాంద్ర‌త త‌గ్గుతుంది. ఎముక‌లు గుల్ల‌గా మార‌తాయి. ఈ విధంగా ఉప్పు మ‌న శ‌రీర ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని క‌నుక దీనిని వీల‌నైంత త‌క్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts