High Protein Foods : మనం మన రోజూ వారి ఆహారంలో అనేక రకాలు పప్పు దినుసులను తీసుకుంటూ ఉంటాము. పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇవి ఎంతో బలమైన ఆహారమని మనందరికి తెలిసిందే. 100 గ్రాముల చికెన్ లో 103 గ్రాముల శక్తి, మటన్ లో 118 గ్రాముల శక్తి మాత్రమే ఉంటుంది. అదే కందిపప్పులో 335 గ్రాముల శక్తి, పెసరపప్పులో 345 గ్రాముల శక్తి, శనగపప్పులో 355 గ్రాముల శక్తి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యంతో పాటు శరీరం కూడా బలంగా ఉంటుంది. అయితే మనలో చాలా మంది పప్పును వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కానీ పప్పును రోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పప్పును రోజూ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు.
నేటి తరుణంలో మనలో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. ప్రోటీన్ లోపించడం వల్ల హార్మోన్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కండపుష్టి తగ్గిపోతుంది. కండరాల పెరుగుదల తగ్గి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా తగిన ప్రోటీన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మన శరీరం ఎంత బరువు ఉంటుందో మనకు రోజూ అన్ని గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ మనకు పప్పుదినుసుల్లో ఎక్కువగా లభిస్తుంది. అలాగే పప్పు దినుసులను చికెన్, మటన్ వంటి ఇతర ఆహారాలతో పోల్చినప్పుడు మనక తక్కువ ధరలో లభిస్తాయని చెప్పవచ్చు. అలాగే మనకు అన్ని రకాల పప్పులు మార్కెట్ లో లభిస్తాయి. మన ఇంట్లో 3 నుండి 4 రకాల పప్పులు ఉండేలా చూసుకోవాలి.
రోజూ ఒకేరకం పప్పుతో తినలేరు కాబట్టి వీటిని మారుస్తూ ఉండాలి. అన్నింటికంటే తేలికగా జీర్ణమయ్యే పప్పులల్లో పెసరపప్పు ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల మనకు 25 శాతం ప్రోటీన్ లభిస్తుంది. వీలైనంత వరకు పొట్టు ఉండే పప్పునే వాడాలి. పొట్టు తీయడం వల్ల పప్పు దినుసుల్లో ప్రోటీన్ తగ్గుతుంది. ఫైబర్ కూడా తొలగిపోతుంది. అదే విధంగా పొట్టు తీయని పప్పులు నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీంతో రక్తంలో చక్కెరస్థాయిలు వెంటనే పెరగకుండా ఉంటాయి. మనం తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా ఉంటుంది. కనుక పొట్టు ఉండే పప్పులను వాడడమే మంచిది. అయితే సాధారణంగా మనం పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు వంటి వాటినే ఎక్కువగా వాడుతూ ఉంటాము.
వీటితో పాటు సోయా గింజల పప్పును కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పును మాత్రం పొట్టు తీసేసిన తరువాత మాత్రమే ఉపయోగించాలని వారు చెబుతున్నారు. ఇలా మన ఇంట్లో ఈ పప్పులను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని రోజూ 50 నుండి 100 గ్రాముల పప్పు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో 15 నుండి 20 గ్రాముల ప్రోటీన్ మన శరీరానికి అందుతుంది. ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. కనుక మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా పప్పును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.