తేనె, దాల్చినచెక్కలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తేనెను నిత్యం చాలా మంది తీసుకుంటారు. ఇక దాల్చిన చెక్కను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ రెండింటిని కలిపిన మిశ్రమాన్ని నిత్యం తీసుకుంటే మనకు అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
పావు టీస్పూన్ దాల్చినచెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనెను కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
అలర్జీలు నయం అవుతాయి
దాల్చిన చెక్క, తేనెల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల అలర్జీలు నయం అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలర్జీలు రాకుండా ఉంటాయి. ఈ మిశ్రమంలో ఉండే గుణాలు అలర్జీలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
చర్మ సమస్యలు
తేనె, దాల్చినచెక్క మిశ్రమం యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల మృత కణాలు తొలగిపోతాయి. చర్మం నుంచి నూనెలు అధికంగా స్రవించకుండా ఉంటాయి. మొటిమలు తగ్గుతాయి. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి.
కీళ్ల నొప్పులు
తేనె, దాల్చినచెక్క మిశ్రమం తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక కప్పు గోరువెచ్చని నీటిలో దాల్చినచెక్క పొడి పావు టీస్పూన్, తేనె రెండు టీస్పూన్లు కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అసిడిటీ
తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా అజీర్ణం, మలబద్దకం, అసిడిటీ సమస్యలు ఉండవు. జీర్ణవ్యవస్థలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
కొలెస్ట్రాల్ స్థాయిలు
దాల్చినచెక్క, తేనె మిశ్రమం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిత్యం ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు రావు.
దాల్చినచెక్క పొడి, తేనె మిశ్రమాన్ని నిత్యం తీసుకోడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు. కొవ్వు కరుగుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.