Honey And Pepper : ప్రస్తుత వర్షాకాలంలో మనలో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. వర్షాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్స్ ను, మందులను వాడుతూ ఉంటారు. వీటిని బదులుగా ఒక చిన్న ఇంటి చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన ఇంట్లో ఉండే మిరియాలను, తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. అలాగే తేనెను, మిరియాల పొడిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
తేనె, మిరియాలు ఇవి రెండు మన ఇంట్లో ఉండేవే. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారు వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి… అలాగే వీటిని కలిపి తీసుకోవడం వల్ల మనకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ రాత్రి పడుకునే ముందు అర టీ స్పూన్ మిరియాల పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో, గొంతులో పేరుకుపోయిన శ్లేష్మం కరిగిపోతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే మిరియాల పొడిని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరుచూ అనారోగ్య సమస్యల బారిన, ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే మిరియాల పొడిని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా తేనె మరియు మిరియాల పొడి మనకు దోహదపడుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారు తేనె మరియు మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ విదంగా తేనె మరియు మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఫ్లూలక్షణాల నుండి బయటపడడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.