Health Tips : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.. అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే మద్యం బాటిల్స్‌పై ఆ విషయాన్ని క్లియర్‌గా ముద్రిస్తారు. అయినప్పటికీ మద్యం ప్రియులు మద్యం సేవించడం మానుకోరు కదా. అయితే వాస్తవానికి మద్యాన్ని పరిమిత మోతాదులో సేవిస్తే మంచిదేనట. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.
మాయో క్లినిక్ చెబుతున్న ప్రకారం.. మహిళలు రోజుకు ఒక డ్రింక్ తాగవచ్చట. అదే పురుషులు అయితే రోజుకు 2 డ్రింక్స్ వరకు తాగవచ్చట. ఒక డ్రింక్ అంటే 355 ఎంఎల్ బీర్ లేదా 148 ఎంఎల్ వైన్ లేదా 44.3 ఎంఎల్ లిక్కర్ అని చెప్పారు.
అంటే పురుషులు రోజుకు 2 డ్రింక్స్ చొప్పున 700 ఎంఎల్ బీర్‌ను లేదా 300 ఎంఎల్ వైన్‌ను లేదా 90 ఎంఎల్ లిక్కర్‌ను తాగవచ్చన్నమాట.
ఈ విధంగా రోజూ మోతాదులో మద్యం సేవించడం వల్ల గుండె ఫెయిల్ అయ్యే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుందని అంటున్నారు.
పైన తెలిపిన విధంగా మోతాదులో మద్యం సేవిస్తే ఆయుర్దాయం పెరుగుతుందని, కిడ్నీ స్టోన్ల సమస్య రాకుండా ఉంటుందని చెబుతున్నారు. అయితే మద్యం ఆరోగ్యకరమే అని చెప్పి ఎక్కువగా తాగరాదు. అతి ఎప్పుడైనా చేటు చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తక్కువగా మద్యం సేవిస్తేనే ఆరోగ్యకరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.