Salt : ఉప్పును మీరు రోజూ ఎంత తింటున్నారు.. మోతాదు మించితే ప్ర‌మాద‌మే..!

Salt : ఉప్పులేని భార‌త‌దేశాన్ని ఊహించుకోవ‌డ‌మే క‌ష్టం. ఎంత మంచి వంట‌కానికైనా రుచి తేవ‌డానికి లేదా చెడ‌గొట్ట‌డానికి చిటికెడు ఉప్పు చాలు. మ‌న పూర్వీకులు ఉప్పును కూడా ఒక ప్ర‌ధాన ఆహారంగానే చూసారు. ఎందుకంటే మ‌న పూర్వీకులు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేవారు. చెమ‌ట రూపంలో ల‌వ‌ణాలు పోయిన ఆ ల‌వ‌ణాలను తిరిగి ఉప్పు భ‌ర్తీ చేస్తుంది. అందుకే ఉప్పు తిన‌క‌పోయినా కూడా వారికి అనారోగ్యాలు వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుత కాలంలో ఈ ప‌రిస్థితి అంతా తారుమారైంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఉప్పు నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. రోజుకు కేవ‌లం 5 నుండి 6 గ్రాముల ఉప్పును మాత్ర‌మే మ‌నం తినాలి.

కానీ కేవ‌లం 5 గ్రాముల ఉప్పును మ‌నం పెరుగ‌న్నంలోనే తింటున్నాం. మ‌న దేశంలో సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రు రోజుకు 11 గ్రాముల ఉప్పును తింటున్నార‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఇంట్లో ఉండాల్సిన ఉప్పు మ‌న ఒంట్లోకి చేరితే మ‌నం అనేక అనార్థాల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. మ‌న వంట్లోకి చేరిన ఉప్పు మ‌న‌ల్ని తిన్న‌గా ఉండ‌నివ్వ‌దు. అధికంగా ఉప్పును తీసుకోవ‌డం వల్ల ర‌క్త‌పోటు, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, మూత్ర పిండాలు ప‌నిచేయ‌క‌పోవ‌డం, పెద్ద ప్రేగు క్యాన్స‌ర్, అధిక బ‌రువు, ఊబ‌కాయం వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. ఒక స్లైస్ బ్రెడ్ లో 150 మిల్లీ గ్రాములు, ఒక క‌ప్పు నూడుల్స్ లో 200 మిల్లీ గ్రాములు, చిన్న క‌ప్పు పాప్ కార్న్ లో 100 మిల్లీ గ్రాములు, చిన్న క‌ప్పు వేయించిన ప‌ల్లీల‌లో 120 మిల్లీ గ్రాములు, ఒక స్పూన్ మిక్చ‌ర్ లో 300 మిల్లీ గ్రాములు, ఒక సాల్ట్ బిస్కెట్ లో 300 మిల్లీ గ్రాముల ఉప్పు ఉంటుంది.

how much salt you are eating excessive is very harmful
Salt

ఒక స్పూన్ ఊర‌గాయ తింటే ఏకంగా 1000 మిల్లీ గ్రాముల ఉప్పును తీసుకున్న వారమ‌వుతాము. ఉప్పును తిన‌మ‌ని చెబుతున్న ప‌రిధిని మ‌నం ఒక్క స్పూన్ ఊర‌గాయ‌, మిక్చ‌ర్, సాల్ట్ బిస్కెట్ వంటి వాటితోనే తినేస్తున్నాము. శ‌రీరంలో ఉప్పు మోతాదు ఒక స్థాయిని దాటితే అధిక ర‌క్త‌పోటు, ఉద‌ర క్యాన్సర్ వంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలా అని ఉప్పును అస‌లే తిన‌కోతే అది ఇంకా ప్ర‌మాదానికి దారి తీస్తుంది. మ‌న‌కు ఆహార ప‌దార్థాల్లో స‌హ‌జంగా అందే సోడియంతో పాటు కొద్దిగా ఉప్పు కూడా శ‌రీరానికి అందాల్సిందే. ఉప్పు ప‌రిధి దాటితో మ‌న ఆరోగ్యాన్ని మ‌న‌మే పాడు చేసుకున్న వాళ్లం అవుతామ‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Share
D

Recent Posts