హెల్త్ టిప్స్

రోజూ ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారా..? అయితే జాగ్ర‌త్త.. కాస్తంత వినోదం కూడా ఉండాల్సిందే..!

24 గంటలూ పనిభారంతో సతమతమయ్యే వ్యక్తులకు ఒత్తిడి తగ్గించుకోడానికి కొన్ని చర్యలు సూచించబడుతున్నాయి. ఒత్తిడి కలిగివుండటం చాలా తీవ్రమైన సమస్య అయినప్పటికి చేసే పనుల్లో కొంత వెరైటీ, హాస్యాన్ని ఆచరించటం వలన దానినుండి బయటపడచ్చంటున్నారు నిపుణులు. ప్రతివారు ఆరోగ్యంగా వుండాలనే కోరుకుంటారు. కానీ నేటి జీవనం ఎంతో కొంత ఒత్తిడి కలిగించి అనారోగ్యం పాలు చేస్తోంది. ఇప్పటికే ఒత్తిడికి గురై సతమతమవుతున్న వారు తమ ఒత్తిడిని తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు పాటించండి. మనలో చాలామంది తెల్లవారి లేస్తే, దుస్తులు వేసుకోవడం, పనులకు ప్రయాణమవటం, పనిచేసుకోవడం, మరల ఇంటికి వచ్చి ఇంటిపనులు చూసుకోవడం మొదలైన వాటిలో ఎంతో ఒత్తిడికి గురవుతారు.

ఆఫీస్ కు లేదా ఇతర కార్యకలాపాలకు చేసే ప్రయాణం ఎంతో ఒత్తిడి కలిగి వుంటుంది. ఆఫీసులో చేసే పని కూడా ఒత్తిడి కలిగి వున్నదే. ఒత్తిడి తగ్గించుకోటానికి కొన్ని చిట్కాలు పాటించకపోతే అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పనికి వెళ్ళడమనేది సరి అయినదే. కాని అపుడపుడూ మీకు ఆనందం కలిగించే ప్రయాణాలు కూడా చేయాలి. కనీసం ఆరునెలలకొకసారి సెలవు పడేసి వినోద యాత్రలుకు వెళితే ఎంతో హాయిగావుంటుంది. సెలవు పెట్టటానికి కుదరకపోతే కనీసం వారాంతపు సెలవులలోనైనా సరే మీకు దగ్గరలోని నచ్చిన విహార స్ధలానికి వెళ్ళి ఆనందించండి. ఉద్యోగస్తులైతే, ఆపీసు పనిమీద టూర్లు వెడుతుంటే, మార్పుకై కుటుంబ సభ్యులను కూడా తీసుకు వెళ్ళి కొంత ఆనందించండి.

how to balance work load and entertainment

అయితే వెళ్ళిన తర్వాత వారితో కలసి ఆనందించటంకూడా చేయాలి. అవసరమనుకుంటే మీ ట్రిప్ ను వ్యక్తిగతంగా ఒకటి లేదా రెండు రోజులు పొడిగించండి. చాలామంది రిలాక్సేషన్ అంటూ లిక్కర్లు తాగటానికి అలవాటు పడతారు. అది సరికాదు. ఆరోగ్యానికి రిలాక్సేషన్ కావలసిందే. కాని లిక్కర్ లు తీసుకోవడం వలన మీకు మత్తు కలిగిస్తుంది తప్ప మైండ్ రిలాక్స్ కాలేదు. రోజంతా పనితో గడిపిన తర్వాత హాయిగా రిలాక్సవుతూ ఒక గ్రీన్ చాయ్ తాగండి లేదా మీకు నచ్చిన చక్కటి మ్యూజిక్ వినండి. మీ డైట్ ఛార్ట్ లో లేనప్పటికి మీకు ఇష్టమైన ఆహారాన్ని ఇష్టమైన ప్రదేశాలలో తీసుకొని ఆనందించటానికి సందేహించకండి.

అందరితో సరదాగా గడపండి అయితే ఆ సరదా మిమ్మల్ని మరోమారు భారం చేసేలా చూసుకోకండి. అందరితో మంచి సంబంధాలు సరైనదే కాని బంధువులైనా, స్నేహితులైనా వారి వారి పరిధులలో వుండేట్లు దూరం పెట్టండి. రిలాక్సేషన్ కు యోగా ఆచరించడం ఉత్తమం. జిమ్ కి వెళ్ళాలంటూ ప్లాన్లు వేసి మానేయటం కన్నా ఇంటిలోనే సమయం చూసుకొని యోగా లేదా మీకు నచ్చిన ధ్యానం వంటివి చేసి ఒత్తిడినుండి దూరం అవటం మంచిది. ఇవ్వబడిన ఈ చిట్కాలు చిన్నవైనప్పటికి, పాటిస్తే మంచి ఫలితాలు కనపడి ఒత్తిడి దూరం కాగలదు. మీకుగల ఆరోగ్యం నేరుగా మీ పనిపై కూడా ప్రభావిస్తుందని తెలుసుకోండి.

Admin

Recent Posts