హెల్త్ టిప్స్

Cinnamon For Diabetes : దాల్చిన చెక్క‌తో షుగ‌ర్‌కు బై చెప్పండి.. ఇలా చేయండి..!

Cinnamon For Diabetes : ఈరోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే కచ్చితంగా మనం ఆరోగ్యం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సరైన జీవన విధానాన్ని పాటించాలి. ఎక్కువమంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. మధుమేహం మనం అనుకున్న దాని కంటే కూడా ఎంతో ప్రమాదకరమైనది. మధుమేహం ఉండడం వలన మన శరీరంలో గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బ తినడం వంటి సమస్యలు కలుగుతుంటాయి.

అయితే ఇలా చేస్తే మధుమేహం సమస్య నుండి బయటపడవచ్చు. కంగారు పడక్కర్లేదు. మీరు రోజువారీ ఆహారంలో పాలు కానీ చీజ్ కానీ తీసుకుంటే చాలా మంచిది. పాల ఉత్పత్తుల్లో ఉండే ప్రోటీన్ మధుమేహంను దూరం చేస్తుంది. ఉబకాయంతో బాధపడే వాళ్ళు కూడా రోజూ వీటిని తీసుకోవచ్చు. అదేవిధంగా షుగర్ తో బాధపడే వాళ్ళు పెరుగుని కూడా కచ్చితంగా తీసుకోవాలి. పెరుగుని కూరగాయలతో లేదా పండ్లతో కలిపి తీసుకోవచ్చు. ఒక కప్పు పెరుగుని ఒక కప్పు పైనాపిల్ ముక్కలు కానీ అరటి పండ్లు వేసుకుని అల్లం, తేనె వేసి తీసుకుంటే చాలా చక్కగా ఇది పనిచేస్తుంది.

how to take cinnamon for diabetes

అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. అల్పాహారాన్ని అసలు మానేయ‌కండి. పోషకాహారం కలిగిన అల్పాహారాన్ని తీసుకోవాలి. షుగర్ తో బాధపడే వాళ్ళు కచ్చితంగా రోజూ వ్యాయామం లేదంటే వాకింగ్ చేయడం ముఖ్యం. స్మోకింగ్ చేయకూడదు. షుగర్ వచ్చే అవకాశం స్మోకింగ్ వలన 30 నుండి 40 శాతం వ‌ర‌కు ఎక్కువగా ఉంటుందని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఊబకాయం వలన శరీరం ఇన్సులిన్ ని సరిగా ఉపయోగించుకోదు.

శరీర బరువు ఐదు నుండి ప‌ది శాతం కోల్పోయినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిల‌లో గణనీయమైన తగ్గుదల కనబ‌డుతుంది. దాల్చిన చెక్కని తీసుకుంటే చాలా మేలు కలుగుతుంది. షుగర్ పేషంట్లకి మేలు చేసే పోషకాలు అందులో ఎక్కువగా ఉంటాయి. పైగా షుగర్ ని కూడా తగ్గించగలదు. దాల్చిన చెక్కని తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. ఉదయం టీ తాగేటప్పుడు కొంచెం దాల్చిన చెక్క వేసుకుంటే మంచిది. ఇలా ఈ మార్పులు చేసుకుంటే షుగర్ తగ్గుతుంది.

Admin

Recent Posts