హెల్త్ టిప్స్

పోషకాలు లోపిస్తే పలు లక్షణాలు కనిపిస్తాయి.. ఏయే పోషకాల లోపం ఉందో ఇలా సులభంగా కనిపెట్టండి..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అనేక రకాల పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలు శరీరానికి లభించకపోతే మనకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దీంతో శరీరం పలు లక్షణాలను మనకు తెలియజేస్తుంది. అయితే ఏయే విటమిన్లు, మినరల్స్‌, ఇతర పోషకాలు లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

identify nutrients deficiency in this way

1. శరీరంలో మెగ్నిషియం లోపిస్తే అరచేతులు చల్లగా మారుతుంటాయి. హైపో థైరాయిడిజం, గుండె బలహీనత ఉన్నప్పుడు కూడా అరచేతులు చల్లగా మారుతుంటాయి.

2. జింక్‌ లోపం ఉంటే చర్మం మీద చారలు ఏర్పడుతాయి. చిన్న దెబ్బలకే రక్తస్రావమవుతుంటే విటమిన్‌ కె లేదా విటమిన్‌ సి లోపించిందని అర్థం. ప్లేట్‌లెట్లు తగ్గినా ఇదే లక్షణం కనిపిస్తుంది. అరచేతులు పసుపు పచ్చగా మారితే బీటా కెరోటిన్‌ ఎక్కువైందని అర్థం.

3. కాలి పిక్కలు పట్టేస్తుంటే మెగ్నిషియం తగ్గిందని అనుకోవాలి. మోకాళ్ల కీళ్లు పట్టేస్తున్నా మెగ్నిషియం తగ్గినట్లేనని అర్థం చేసుకోవాలి.

4. హైపో థైరాయిడిజం, అయోడిన్‌ లోపం సమస్యలు ఉంటే గొంతు వాపులు కనిపిస్తాయి.

5. గోళ్ల మీద తెల్లని మచ్చలు ఏర్పడితే జింక్‌ లోపం ఏర్పడిందని తెలుసుకోవాలి. గోళ్లు మెత్తగా మారి విరిగిపోతుంటే మెగ్నిషియం తగ్గిందని అర్థం.

6. ముఖం మీద, ముక్కు పక్కల ఎర్రగా కంది, చర్మం లేస్తుంటే విటమిన్‌ బి2 లోపించిందని తెలుసుకోవాలి. నుదురు మీద, ముక్కు, పక్కల నూనెతో కూడిన పొక్కులొస్తుంటే విటమిన్‌ బి6 తగ్గిందని అనుకోవాలి.

7. క్రోమియం తగ్గితే శుక్లాలు వస్తాయి. ఫుడ్‌ అలర్జీతో కళ్ల కింద నల్లని వలయాలు, వాపు లక్షణాలు కనిపిస్తాయి.

8. నాలుక తెల్లగా పాలిపోయి ఉంటే ఐరన్‌ లోపం ఉందనుకోవాలి. నొప్పితో కూడిన ఎర్రని పుండ్లు ఏర్పడితే విటమిన్‌ బి3 లోపంగా భావించాలి. నాలుక వాపు ఎలర్జీకి గుర్తు. నాలుక నొప్పి పెడుతూ నున్నగా తయారైతే ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గిందని అర్థం. విటమిన్‌ బి2 తగ్గితే పెదవులు పగులుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts