ప్రస్తుత తరుణంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లను ఇస్తున్నారు. దీంతో వారు ఆన్ లైన్‌లో వీడియోలు చూడడం, పాటలు వినడం లేదా పాఠాలకు హాజరు కావడం చేస్తున్నారు. అయితే వాటికి సంబంధించిన ఆడియోను వినేందుకు పిల్లలు ఎక్కువగా ఇయర్ ఫోన్స్ ను వాడుతుంటారు. కానీ నిజానికి వారు అవి వాడడం మంచిది కాదు. వాటితో అనారోగ్య సమస్యలు వస్తాయి.
పిల్లలకు ఆన్‌లైన్ క్లాసుల కోసం అయితే ఇయర్ ఫోన్స్ ను కొంత సేపు ఇవ్వవచ్చు. కానీ అదే పనిగా వారు వాటిని నిరంతరాయంగా వాడడం మంచిది కాదు. ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడడం వల్ల చిన్నారుల చెవుల వినికిడి శక్తి చాలా త్వరగా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. పెద్దల కన్నా వారి చెవులు, లోపలి కర్ణభేరి చాలా సున్నితంగా ఉంటాయి. అందువల్ల వారు ఇయర్ ఫోన్స్ ను ఎక్కువ సేపు వాడకుండా చూడాలి.
ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడితే చెవుల్లో నొప్పి, అసౌకర్యం, చెవుల్లో ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు వస్తాయి. దీంతోపాటు చెవులపై ఒత్తిడి పెరుగుతుంది. వినికిడి శక్తి త్వరగా నశిస్తుంది. చెవులు శబ్దాలను వినే శక్తిని త్వరగా కోల్పోతాయి.
వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం చిన్నారుల చెవులు చాలా సున్నితంగా ఉంటాయి. అందువల్ల వాటిలోకి సూక్ష్మ క్రిములు చాలా సులభంగా ప్రవేశిస్తాయి. అందులోనూ ఇయర్ ఫోన్స్ వాడితే సూక్ష్మ క్రిములు మరింత వేగంగా లోపల చేరుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కనుక వారు ఇయర్ ఫోన్స్ ను ఎక్కువ సేపు వాడకుండా చూడాలి. అలాగే ఇయర్ ఫోన్స్‌ను వాడేముందు వాటిని వస్త్రంతో శుభ్ర పరుచుకోమని చెప్పాలి. దీంతో చెవి సమస్యలు రాకుండా చిన్నారులను రక్షించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365