ప్రస్తుతం అనేక మంది యాంత్రిక జీవితం గడుపుతున్నారు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు రకరకాల ఒత్తిళ్లతో సతమతం అవుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే నిత్యం కనీసం ఒక పావుగంట పాటు అయినా నవ్వాల్సి ఉంటుంది. అవును.. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* నిత్యం 15 నిమిషాల పాటు నవ్వితే 2 గంటల పాటు నిద్రించినంత లాభం కలుగుతుంది. అంటే 2 గంటల పాటు నిద్రించడం వల్ల మన శరీరానికి ఏవిధంగానైతే ఆరోగ్యం కలుగుతుందో.. అదే ఒక్క పావు గంట పాటు నవ్వితే.. సరిగ్గా అదేలాంటి లాభం కలుగుతుందన్నమాట.
* నవ్వడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. అదేంటీ.. షుగర్‌కు, నవ్వడానికి సంబంధం ఏమిటి ? అని సందేహిస్తున్నారా ? అయితే సంబంధం ఉంది. ఎందుకంటే.. సుదీర్ఘకాలం ఒత్తిడి వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల నిత్యం నవ్వితే డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు. అది లేని వారికి ఆ జబ్బు రాకుండా ఉంటుంది.
* నవ్వడం వల్ల శరీరంలో రక్త నాళాలు వెడల్పుగా మారుతాయి. దీంతో రక్తసరఫరాకు సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
* నవ్వడం వల్ల ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండవచ్చు. కారణం.. నవ్వడం వల్ల ముఖంలో రక్త సరఫరా పెరుగుతుంది. ఇది ఆ ప్రాంతంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల నవ్వడం అనేది మనకు యవ్వనాన్ని అందిస్తుంది.
* నిత్యం అనేక ఒత్తిళ్ల మధ్య సతమతం అయ్యే వారు కనీసం 15 నిమిషాల పాటు నవ్వితే చాలు.. ఒత్తిడి అంతా మటుమాయం అవుతుంది. శరీరంలో హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి.
* నవ్వడం వల్ల శరీరంలో యాంటీ బాడీల సంఖ్య పెరుగుతుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. కనుక నిత్యం నవ్వితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
* నవ్వడం అనేది సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఏ భాగంలో అయినా నొప్పి ఉన్నప్పుడు కాసేపు నవ్వి చూడండి. తేడా మీకే తెలుస్తుంది.
* నవ్వడం వల్ల ఛాతి భాగం, జీర్ణాశయం అన్నీ కదులుతాయి. దీంతో అంతర్గతంగా వాటికి వ్యాయామం అయినట్లు అవుతుంది. ఈ క్రమంలో ఆయా భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* నిద్రలేమి సమస్య ఉన్నవారు నిత్యం 15 నిమిషాల పాటు నవ్వితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. రోజూ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
* నవ్వడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. బాగా అలసిపోయాం అనుకున్నప్పుడు కొంత సేపు నవ్వి చూడండి. శక్తి అందినట్లు ఫీలవుతారు.
అయితే నవ్వడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి సరే.. మరి నవ్వడం ఎలా..? అంటే మీకు నచ్చిన హాస్య భరిత కథలు చదవవచ్చు. వీడియోలు చూడవచ్చు. జోకులు చదవవచ్చు. వేరే వాళ్ల ద్వారా జోకులు వినవచ్చు. లేదా కొందరు గుంపుగా ఉంటే సినిమాల్లోని జోకులు చెప్పుకుని నవ్వవచ్చు. ఎలా నవ్వినా సరే నిత్యం 15 నిమిషాల పాటు నవ్వడం మొదలు పెట్టండి. దీంతో పైన తెలిపిన విధంగా అనేక లాభాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365