Coffee : ఉదయం నిద్ర లేచిన వెంటనే కొందరికి బెడ్ కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఇక కొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత కాఫీ తాగుతుంటారు. అయితే ఉదయం కాఫీ తాగరాదని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయం కాఫీ తాగడం వల్ల అందులో ఉండే చేదు రుచి జీర్ణాశయంలో ఆమ్లాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. కనుక ఉదయం కాఫీ తాగరాదు.
2. ఉదయం కాఫీ తాగడం వల్ల కొందరిలో కంగారు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల రోజంతా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అది నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది.
3. ఉదయం పూట కాఫీ తాగడం వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్), అల్సర్లు, గుండెల్లో మంట, వికారం, అజీర్ణం వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
4. ఉదయం పూట సహజంగానే అందరిలోనూ కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. అలాంటి సమయంలో కాఫీని తాగితే అందులో ఉండే కెఫీన్ వల్ల కార్టిసోల్ మరింత పెరుగుతుంది. దీంతో శరీరం అధికంగా ఒత్తిడిని అనుభవిస్తుంది. ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. గుండె జబ్బులు, డయాబెటిస్‌కు కారణం అవుతుంది. కనుక ఉదయం పూట కాఫీ మంచిది కాదు.
5. ఉదయం కాఫీ తాగే వారిలో చాలా మందిలో గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుందని, బీపీ కూడా పెరిగిందని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. కనుక ఉదయం కాఫీ తాగరాదు. కాఫీని మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత 2 గంటలు గ్యాప్ ఇచ్చి తాగవచ్చు. దీంతో అప్పటి వరకు పనిచేసిన ఒత్తిడి పోయి రిలాక్స్ అవుతారు. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే సాయంత్రం పూట ఇంకో కప్పు కాఫీ తాగవచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం కాఫీ తాగరాదు.