హెల్త్ టిప్స్

నీళ్ల‌ను అతిగా తాగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త సుమా..!

మనుషులతో పాటు ఇతర జీవులు జీవించాలంటే నీరు ఎంతో ముఖ్యం. నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా దివ్యౌషధం నీళ్లు. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉన్న డ్రింగ్స్ తాగటం వల్ల ఎన్నో వ్యాధులు దరి చేరకుండా కాపాడుతాయి. అయితే కొంతమంది నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. మరికొంత మంది నీటిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే నీళ్లు తక్కువ తీసుకోవటం వల్ల వీరికి రకరకాలైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు నీరు తక్కువ తీసుకోవడం వలన మరెన్నో ఇతర లాభాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ అందం, ఆరోగ్యానికి మంచి నీళ్లే కారణమని చెబుతుంటారు. అయితే ఎంత నీరు తాగాలో అంతే తాగాలి. ఎక్కువ నీరు తాగినే ఆరోగ్యానికి హానికరం. నీరు అతిగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?

ఇక మంచి నీరు అతిగా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు . ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది మంచిది కాదు. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా తాగితే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. అంతేకాదు రక్తం పెరగడం కారణంగా రక్తనాళాలు, గుండెపై అదనపు భారం పడుతుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తాయి.

if you are drinking water excessively then know what happens

అయితే నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. ఇక శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా మూత్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం స్థాయి తగ్గి మరణానికి దారి తీస్తుంది. అతిగా నీరు తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

Admin

Recent Posts