Pickle : కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. మనం ఏ పని చేసినా ఎంత సంపాదించిన జానెడు పొట్ట కోసమే అని అంటున్నారు ఈ తరం వాళ్లు. అందుకే చేతి నిండా సంపాదించి ఇష్టమైనవి తింటూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. గతంలో అయితే పెద్దలు ఏది పెడితే అది తింటూ పద్దతిగా తింటూ నలుగురికి ఆదర్శంగా ఉండే వారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎన్ని రోగాల బారినపడినప్పటికి భోజనం విషయంలో మాత్రం ఏలోటు లేకుండా చూసుకుంటున్నారు. కడుపు నిండా తృప్తిగా తింటూ ఆనందిస్తున్నారు. మనం తినే ఆహార పదార్థాలు, పచ్చళ్లు పగటిపూట ఎంత తిన్నా మనకు ఏమి కాదు. అందుకు కారణం మనం పగటి పూట అనేక పనులు చేస్తూ ఉంటాం. అందువల్ల మన కడుపులో జఠరరసం ఉత్పత్తి అయ్యి మనం తిన్నది సులభంగా జీర్ణమవుతుంది.
కనుక పగటి పూట ఎటువంటి ఆహారపదార్థాలను తీసుకున్నా ఏ ఇబ్బంది ఉండదు. రాత్రిపూట చాలా మంది పెరుగన్నంతో పచ్చడిని కలిపి తింటారు. కొందరూ భోజనాన్ని పచ్చడితో మొదలు పెడతారు. కొందరికి పచ్చడితో తిననిదే భోజనం చేసినట్టుగా ఉండదు. ఇలా ఏదో ఒక విధంగా పచ్చడిని తింటున్నారు. కానీ రాత్రివేళ మాత్రం పచ్చళ్లను తినకూడదు. మరీ ముఖ్యంగా నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లను అసలే తినకూడదని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి పేరు చెబితే చాలు నోరు ఊరని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ పచ్చళ్లను ఇష్టపడే వారు మనలో చాలా మందే ఉండి ఉంటారు.
ఈ పచ్చళ్ల తయారీ అలాగే వినియోగం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ పచ్చళ్లనే రాత్రిపూట తింటే మాత్రం అనారోగ్యాలను కోరి తెచ్చకున్నట్టే అవుతుందని అంటున్నారు వైద్య నిపుణులు. ఈ పచ్చళ్లలో కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు ఎక్కువగా కలుపుతారు. ఇవి పగటిపూట తిన్నప్పుడు ఏవిధమైనా హానిని కలిగించవు. కానీ రాత్రిపూట ఈ పచ్చళ్లను తింటే అవి విషంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట నిమ్మ, ఉసిరికాయ పచ్చళ్లను తినడం వల్ల వాతం వచ్చే అవకాశం ఉందట. అంతేకాకుండా వీటిని రాత్రిపూట తినడం వల్ల తలలోని కొన్ని నాడులు పగిలిపోయే అవకాశం కూడా ఉందట. తరచుగా ఈ పచ్చళ్లను తింటే పక్షవాతం వస్తుందని చెబుతున్నారు. అలాగే వాతం ఉన్నవారు రాత్రిపూట ఈ పచ్చళ్లను అస్సలు తినకూడది హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా దోసకాయ, సొరకాయ, పెసరపప్పు, చింతకాయ కూడా తినకూడదని సూచిస్తున్నారు.