Knee Sounds : కీళ్ల నుంచి శ‌బ్దాలు వ‌స్తూ నొప్పులు బాగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..!

Knee Sounds : ఈ మూడు ప‌దార్థాల‌ను తీసుకుంటే చాలు మ‌న మోకాళ్ల నుండి శ‌బ్దం రావ‌డం త‌గ్గుతుంది. చాలా మందిలో న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దం వ‌స్తుంది. ఎక్కువ‌గా కూర్చునేట‌ప్పుడు, న‌డిచేట‌ప్పుడు ఈ శబ్దం వ‌స్తుంది. దీనినే జాయింట్ క్రిపిటేష‌న్ అంటారు. కీళ్ల మ‌ధ్య ఉండే జిగురు త‌గ్గిపోవ‌డం వ‌ల్ల న‌డిచేట‌ప్పుడు ఇలా శ‌బ్దం వ‌స్తుంది. శ‌బ్దం రావ‌డంతో పాటు విప‌రీత‌మైన నొప్పి, వాపు కూడా ఉంటుంది. మోకాళ్ల నొప్పులు, వాపులు, అలాగే న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దం రావ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వీటిని ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. స‌మ‌స్య త‌లెత్తిన వెంట‌నే త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం అవ‌స‌రం. స‌మ‌స్య‌ను ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా అది మ‌రింత తీవ్ర‌మై జీవిత కాలం వేధించే అవ‌కాశం ఉంది. క‌నుక ఇటువంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ మూడు ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

మోకాళ్ల నొప్పుల‌ను, మోకాళ్ల నుండి శ‌బ్దం రావ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన ఆ మూడు ప‌దార్థాలు ఏమిటి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నుండి వ‌చ్చే శ‌బ్దాన్ని త‌గ్గించ‌డంలో మెంతులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రోజూ రాత్రి ఒక టీ స్పూన్ మెంతుల‌ను నీటిలో వేసి నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజూ ఉద‌యం ఈ మెంతుల‌ను నీటితో స‌హా ఉడికించాలి. త‌రువాత వీటిని వ‌డ‌క‌ట్టుకుని నీటిని తాగాలి. త‌రువాత గింజ‌ల‌ను న‌మిలి తినాలి. ఇలా చేయ‌డం వల్ల మోకాళ్ల నుండి శ‌బ్దం రావ‌డం త‌గ్గుతుంది. అలాగే మోకాళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి. అయితే మెంతుల‌ను వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి చేస్తుంది. క‌నుక గ‌ర్భిణీ స్త్రీలు వీటిని వాడ‌కూడ‌దు. అలాగే వేడి వ‌ల్ల చ‌ర్మంపై అల‌ర్జీలు వ‌చ్చే వారు కూడా ఈ మెంతుల‌ను వాడ‌కూడ‌దు. అలాగే మోకాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌తిరోజూ ఒక గ్లాస్ పాల‌ల్లో చిటికెడు ప‌సుపును క‌లిపి తాగాలి.

if you are having knee sounds then follow these tips
Knee Sounds

ఇలా చేయ‌డం వ‌ల్ల మోకాళ్ల‌కు సంబంధించిన అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భించి ఎముక‌లు ధృడంగా తయార‌వుతాయి. అంతేకాకుండా న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దం రాకుండా ఉంటుంది. అలాగే మోకాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన మ‌రో ప‌దార్థం వేయించిన శ‌న‌గ‌లు మ‌రియు బెల్లం. వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల నుండి శ‌బ్దం రావ‌డం కూడా త‌గ్గుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా అందుతాయి. రోజూ గుప్పెడు వేయించిన శ‌న‌గ‌ల‌ను, నిమ్మ‌కాయంత బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ప్ర‌తిరోజూ ఈ మూడు ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మోకాళ్ల నుండి వ‌చ్చే శ‌బ్దాలు పూర్తిగా త‌గ్గిపోతాయి. కీళ్ల స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

D

Recent Posts