హెల్త్ టిప్స్

అధిక బ‌రువును త‌గ్గించే డ్రింక్‌.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..

ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారిపొయింది.. కాలంతో ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి.దాంతో ఊరికే బరువు పెరుగుతున్నారు. వయస్సు కన్నా ఎక్కువగా బరువు పెరగడంతో ఇబ్బందులు పడటాన్ని మనం చూస్తూనే ఉంటాము.ఇంట్లో, బయట నలుగురితో కలిసి తిర‌గలేము..దాని వల్ల బరువును తగ్గించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. చివరికి విసిగిపొయి అడ్జస్ట్ అవుతారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా.. అధిక బరువును తగ్గించే సూపర్ డ్రింక్ మీకోసమే..అందుకు కావాల్సిన పదార్థాలు, తయారి విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు పెద్ద సైజు నిమ్మకాయలు, ఒక ఇంచు అల్లం ముక్క, టేస్ట్ కోసం తేనెను తీసుకోవాలి. ఇక ఈ డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలంటే.. ముందుగా నిమ్మకాయలను సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే అల్లం ముక్క పైన చెక్కు తీసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక బౌల్ తీసుకోని అందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి.

if you are over weight take this drink daily

నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి..ఆ తర్వాత 2 నిమిషాలు మరిగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి, 10 నిమిషాలు బాగా మ‌ర‌గ‌నివ్వాలి..దానిని చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి వడ గట్టి అందులో అర చెంచా తేనె కలిపి తీసుకోవాలి..ఇలా రోజుకు మూడు సార్లు తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వు సులువుగా కరిగిపోతుంది…కేవలం మూడు రోజులలోనే మంచి రిజల్ట్ ఉంటుంది.. ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.

Admin

Recent Posts