హెల్త్ టిప్స్

Frequent Urination : అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. వెంటనే తగ్గుతుంది..!

Frequent Urination : చాలామంది అతిమూత్ర వ్యాధితో బాధపడుతుంటారు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగిన మొదట్లో ఆ మందుల వల్ల తగ్గినట్లు కనిపించినా ఆ తర్వాత యథాప్రకారం మూత్రం వస్తూనే ఉంటుంది. మూత్రాశయం నిండిన విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది. దీనిని మనం కంట్రోల్ చేయలేం. అయితే ఒక్కోసారి అతి మూత్రం సమస్య కూడా ఏర్పడుతుంది. దీంతో అకస్మాత్తుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో దగ్గినా, తుమ్మినా మూత్రం లీకవుతూ ఉంటుంది. ఒక మనిషి రోజులో 8 కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తే అతి మూత్రం సమస్య ఉన్నట్లే. రాత్రిపూట 1,2 సార్లు కంటే ఎక్కువగా మూత్రం పోసేందుకు నిద్ర లేవడం. లోదుస్తుల్లోనే మూత్రం లీక్ కావడం అతి మూత్రం లక్షణాలు.

ఈ సమస్య ఎక్కవగా ఆడవారిలో వస్తుంది. సుమారు 50 శాతం మంది మహిళలు జీవితంలో ఎప్పుడో అప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటారు. సాధారణంగా 40, 50 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య కనపడుతుంది. ఊబకాయుల్లో, ఎక్కువమంది సంతానం కన్నవారిలో మూత్రాశయ కండరాలు బలహీనపడుతుంటాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికి గురైనా మూత్రం లీక్ అవుతుంది. దీనికి రకరకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. టెన్షన్ ఫ్రీ వజైనల్ టిప్ (టీవీటీ) పద్ధతిలో మూత్రమార్గం కింద టేపులాంటిది అతికిస్తారు. కొందరికి ల్యాప్రోస్కోపీ సాయంతో కాల్పోసస్పెన్షన్ కూడా చేస్తారు. అలాగే జీవనశైలి మార్చుకోవడంతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటంటే.. రాత్రిపూట 7 గంటల తర్వాత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోకూడదు. దీంతో వారికి రాత్రిళ్లు ఎక్కువ మూత్రం వస్తుంది.

if you are suffering from frequent urination then do like this

మద్యం తీసుకోవడం కారణంగానూ మూత్రం ఎక్కువగా రావొచ్చు. అధిక బరువు తగ్గించుకోవాలి. ఎందుకంటే అధిక బరువు మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ధూమపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే పొగ కారణంగా మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం పడి సమస్య ఏర్పడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా అతిమూత్రం సమస్యను పరిష్కరించవచ్చు. ఉసిరి ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఉసిరి మూత్రాశయాన్ని క్లియర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. నువ్వులు కూడా మూత్రాశయ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి వీటిలో బెల్లం కలిపి లడ్డూల్లా చేసి ఈ సమస్యని దూరం చేసుకోండి. ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవాలి. తరచూ ఇలా చేస్తే అతి మూత్రం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Admin

Recent Posts