Ghee : నెయ్యి.. ఇది మనందరికి తెలిసిందే. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వంటల్లో కూడా నెయ్యిని వాడుతూ ఉంటాం. నెయ్యితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది నెయ్యిని ఇష్టంగా తింటారు. అయితే మనలో చాలా మందికి నెయ్యిపై అనేక అపోహలు ఉన్నాయి. నెయ్యి తింటే లావవుతారని, నెయ్యి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని, నెయ్యి తినకూడదని.. ఇలా రకరకాల అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అసలు నెయ్యిని తినవచ్చా.. నెయ్యి వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఆవు నెయ్యిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే నెయ్యిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు, ప్రేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలగిపోతాయి. అలాగే నెయ్యి చాలా సులభంగా జీర్ణమవుతుంది. మలబద్దకంతో పాటు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు నెయ్యిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. నెయ్యిని ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మెదడు పనితీరు పెరుగుతుంది. చదువుకునే పిల్లలకు, ఎదిగే పిల్లలకు నెయ్యిని తప్పకుండా ఆహారంలో భాగంగా ఇవ్వాలి. నెయ్యిని తినడం వల్ల పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
నెయ్యిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక వక్తి పెరుగుతుంది. దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిని తినడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా నెయ్యిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు నెయ్యిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన శరీరానికి శక్తిని, బలాన్ని ఇవ్వడంతో పాటు నెయ్యిని తినడం వల్ల మనం అందం కూడా మెరుగుపడుతుంది. మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో నెయ్యి మనకు ఎంతో సహాయపడుతుంది. నెయ్యిని తిపడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నెయ్యిని తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
నెయ్యి మనకు మేలు చేసేదే అయినప్పటికి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కనుక నెయ్యి రోజుకు 3 నుండి 4 టేబుల్ స్పూన్ ల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. వంటల్లో నూనెను బదులుగా నెయ్యిని కూడా వాడవచ్చు. అలాగే నెయ్యిని వీలైనంత వరకు పగటి పూట మాత్రమే తీసుకోవాలి. నెయ్యి మనకు మేలు చేసేదే అయినప్పటికి నెయ్యితో చేసిన తీపి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తగిన మోతాదులో తగిన సమయంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.