హెల్త్ టిప్స్

Pasaru : ఉదయాన్నే నోట్లో నుండి పసరు తీసేవాళ్ళు.. తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి..!

Pasaru : చాలామంది, నోట్లో నుండి ఉదయాన్నే పసరు వస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పసర్ల సమస్య తగ్గాలంటే, ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పసరుని తీయడానికి, చాలామంది ఉదయం పూట, బ్రష్ చేసేటప్పుడు నోట్లో వేలు పెట్టుకొని, బలవంతంగా తీస్తూ ఉంటారు. కానీ, ఇది అసలు మంచిది కాదు. ఇటువంటి అలవాటు ఉన్నట్లయితే, మానుకోవడం మంచిది. చాలామంది, ఈ రోజుల్లో సరైన జీవన విధానాన్ని అనుసరించట్లేదు.

మంచి ఆహారపు అలవాట్లు కూడా పాటించట్లేదు. రాత్రిళ్ళు చాలామంది, ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం వంటివి చేస్తున్నారు. కానీ, అలా చేయకూడదు. రాత్రిపూట పది, పదకొండు వరకు భోజనం చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. రాత్రి పూట ఏడూ, ఎనిమిది గంటలకి డిన్నర్ పూర్తి చేసేసుకోవాలి. రాత్రిపూట ఇలా ఆలస్యంగా చేయడం వలన సరిగ్గా తిన్నది అరగదు. దీంతో రాత్రంతా కూడా జూసెస్ ప్రొడ్యూస్ అవ్వడం, ఇబ్బంది కలగడం వంటివి జరిగి, ఉదయాన్నే పసర్లు రావడం వంటివి జరుగుతాయి.

if you are taking pasaru in morning then you should know this

రాత్రిపూట ఆరు, ఏడు గంటల లోపు భోజనం చేసేయడం మంచిది. ఉడికిన ఆహార పదార్థాలు తీసుకోండి. కానీ ఆయిల్ ఎక్కువ ఉన్నవి, బాగా మసాలాలు వంటివి తీసుకోవద్దు. నాచురల్ ఫుడ్స్ ని ఎక్కువ తీసుకుంటే, తిన్నది బాగా జీర్ణం అవుతుంది. నానబెట్టిన గింజలు వంటివి తీసుకుంటే మంచిది. బాదంపప్పు, జీడిపప్పు ఇలాంటివి తీసుకోవచ్చు. నాలుగు రకాల పప్పులు నానబెట్టుకుని, రాత్రి తీసుకుంటే మంచిది.

డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా తీసుకోవచ్చు. పండ్లు కూడా మీరు తీసుకోవచ్చు. స్లోగా నములుతూ వీటన్నిటిని తీసుకోవడం మంచిది. తినే ఆహారం సరిగ్గా జీర్ణము అవ్వకపోవడం, ఆహారం కారణంగా ఇబ్బంది ఉండడం వలన ఈ సమస్య వస్తుంది. కాబట్టి, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి కనుక, సాయంత్రం 6 లేదా 7 గంటలకి డిన్నర్ తినేసేయండి. అప్పుడు ఇటువంటి బాధలు ఏమి కూడా ఉండవు.

Admin

Recent Posts