అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అరటిపండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే అరటి పండ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు వాటిని తినకూడదు. లేదంటే అనారోగ్య సమస్యలు మరింత తీవ్రం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. అధిక బరువు ఉన్న వారు అరటి పండ్లను తినరాదు. తింటే ఆ పండ్లలో ఉండే కార్బొహైడ్రేట్లు వారిలో కొవ్వు కింద మారుతాయి. దీంతో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఇంకా ఎక్కువగా బరువు పెరుగుతారు. కనుక అధిక బరువు ఉన్నవారు అరటి పండ్లను తినరాదు.
2. హైపర్‌కలేమియా అనే వ్యాధి ఉన్నవారు కూడా అరటి పండ్లను తినరాదు. తింటే గుండె సంబంధ సమస్యలు వస్తాయి. బీపీ పెరుగుతుంది. ఎల్లప్పుడూ టెన్షన్, ఆందోళనతో ఉంటారు. హైపర్ కలేమియా అంటే శరీరంలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉండడం అన్నమాట. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కనుక వారు ఆ పండ్లను తినరాదు.
3. అరటి పండ్లలో థయామిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మైగ్రేన్ ఉన్నవారికి మంచిది కాదు. దీని వల్ల తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది. అది నాడుల డ్యామేజ్‌కు దారి తీస్తుంది. కనుక మైగ్రేన్ ఉన్నవారు అరటి పండ్లకు దూరంగా ఉండాలి.
4. మధుమేహం ఉన్నవారు అరటి పండ్లను తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. మళ్లీ ఆ స్థాయిలు తగ్గాలంటే అందుకు లివర్, మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. లేదంటే చక్కెర స్థాయిలు పెరిగి తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
5. అలర్జీ సమస్య ఉన్నవారు అరటిపండ్లను తినరాదు. తింటే ముఖం, ఇతర శరీర భాగాలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. దురద కూడా ఉంటుంది. కనుక అలాంటి వారు అరటిపండ్లను తినకూడదు.
6. మూత్రపిండాలు, మూత్రాశయ సమస్యలతో బాధపడుతున్నవారు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. ఎందుకంటే అరటిపండ్లలో ఉండే పొటాషియం కిడ్నీలపై భారం పెంచుతుంది. దీంతో కిడ్నీలు త్వరగా పాడైపోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ సమస్యలు ఉన్నవారు కూడా అరటి పండ్లను తినరాదు.
ఇక మిగిలిన ఎవరైనా సరే అరటి పండ్లను తినవచ్చు. దాంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365