హెల్త్ టిప్స్

అల్లం రసం అందించే లాభాలను మరిచిపోకండి.. ఈ సీజన్‌లో అల్లం రసంను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసుకోండి..!

మనందరి వంట ఇళ్లలో ఉండే పదార్థాల్లో అల్లం ఒకటి. దీన్ని నిత్యం మనం కూరల్లో వేస్తుంటాం. అల్లం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వర్షాకాలం సీజన్‌లో అల్లం రసంను రోజూ తీసుకోవాలి. దీంతో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ సీజన్‌లో అల్లం రసంను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take ginger juice in this season

1. వర్షాకాలంలో సహజంగానే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రక రకాల ఇన్‌ఫెక్షన్లు, సీజనల్‌ వ్యాధులు వస్తాయి. జ్వరం, దగ్గు, జలుబు బాధిస్తుంటాయి. కనుక అల్లం రసంను సేవించడం వల్ల ఆయా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

2. ఈ సీజన్‌లో మనకు డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలుతుంటాయి. కానీ అల్లం రసంను రోజూ తీసుకోవడం వల్ల విష జ్వరాలు రాకుండా శరీరాన్ని ముందుగానే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

3. దగ్గు, జలుబు సమస్యలు అనేవి ఈ సీజన్‌లో కామన్‌. కనుక అల్లం రసంను సేవిస్తుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

4. వర్షాకాలంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ అవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి. విరేచనాలు, వాంతులు అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే అల్లం రసంను తీసుకోవాలి.

అల్లం రసంను రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకోవచ్చు. ఒక టీస్పూన్‌ మోతాదులో తాగాలి. ఇక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మూడు పూటలా భోజనానికి ముందు ఒక టీస్పూన్‌ అల్లం రసం తాగవచ్చు. అలాగే అల్లంను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు రెండు పూటలా తాగవచ్చు. దీంతో రోగాల బారి నుంచి రక్షణ లభిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts