Featured

జామ పండ్లు, జామ ఆకుల‌తో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించుకోవ‌చ్చు.. వాటిని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

జామ పండ్లు మ‌న‌కు దాదాపుగా ఏ సీజ‌న్‌లో అయినా స‌రే ల‌భిస్తాయి. వ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఇవి ఇంకా ఎక్కువ‌గా అందుబాటులో ఉంటాయి. వీటిల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. జామ ఆకులు, పండ్ల‌లో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంతోపాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.

take guava fruits and guava leaves water daily to improve blood sugar levels

జామ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఒక జామ పండు ద్వారా మ‌న‌కు సుమారుగా 50 నుంచి 300 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి ల‌భిస్తుంది. అలాగే ఈ పండ్ల‌లో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్‌, లైకోపీన్‌, లుటీన్, గామా కెరోటిన్‌, బీటా క్రిప్టోజాంతిన్‌, క్రిప్టో ఫ్లేవిన్‌, రుబిజాంతిన్‌, నియోక్రోమ్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అందువ‌ల్ల జామ పండ్ల‌ను రోజూ తినాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

జామ పండ్ల‌లో ఫినోలిక్ స‌మ్మేళ‌నాలైన ఆంథో స‌య‌నిన్స్‌, మైరిసెటిన్‌, ఎల్లాజిక్ యాసిడ్‌లు ఉంటాయి. అలాగే ఫైబ‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌లు ఉంటాయి. ఇవ‌న్నీ షుగ‌ర్ ఉన్న‌వారికి మేలు చేసే పోష‌కాలే. అందువ‌ల్ల జామ పండ్ల‌ను తిన‌డం మ‌రిచిపోకూడ‌దు. రోజూ మూడు పూట‌లా భోజ‌నం చేసిన అనంత‌రం ఒక జామ పండును తింటుండాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి.

ఇక జామ ఆకుల్లో ఎన్నో పోష‌కాలు, బ‌యోయాక్టివ్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అధ్య‌య‌నాల ప్ర‌కారం జామ ఆకుల్లో 18.53 శాతం ప్రోటీన్లు, 103 మిల్లీగ్రాముల విట‌మిన్ సి, 1717 మిల్లీగ్రాముల గాల్లిక్ యాసిడ్ ఉంటాయి. అలాగే క్వ‌ర్సెటిన్‌, ఫ్లేవ‌నాయిడ్స్, కెఫిక్ యాసిడ్‌, ఫెరూలిక్ యాసిడ్‌, కాటెకిన్, కెయింప్‌ఫెరాల్‌, ఎపికాటెకిన్‌, హైప‌రిన్ వంటి స‌మ్మేళ‌నాలు కూడా ఉంటాయి. ఇవ‌న్నీ షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.

అందువ‌ల్ల రోజూ జామ పండ్ల‌ను తిన‌డంతోపాటు జామ ఆకుల‌ను మ‌రిగించిన నీటిని తాగుతుండాలి. ఆ నీటిని ఉద‌యం, సాయంత్రం తాగాల్సి ఉంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ బాగా త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts