హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ వ‌చ్చిందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

ఆధునీకరణ ఫలితాలు గత కొద్ది సంవత్సరాలుగా మానవుడి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. టీవీలు చూడటం, చిప్స్ తినడం, లిక్కర్లు, కూల్ డ్రింకులు తాగేయడం ఆనారోగ్యం పాలు చేస్తోంది. వివిధ రంగాలలో కంప్యూటర్ ఆధారిత పని దీనిని మరింత దిగజార్చింది. ఈ రకంగా మనమంతా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి బరువు పెరగటం, గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, రక్తపోటు మొదలగువాటికి గురవుతున్నాము.

అధిక బరువు సమస్య జీవ ప్రక్రియ సంబంధిత సమస్యలు తెచ్చిపెడుతోంది. డయాబెటీస్, రక్తపోటు, కొల్లెస్టరాల్, గుండెపోటు, పక్షవాతం ఎన్నో వస్తున్నాయి. పొట్ట పెరిగి నడుము నొప్పులు అధికం అవుతున్నాయి. దీనితో పాటు డిస్క్ తొలగటం, స్పాండీలైటిస్ వస్తున్నాయి. వీటికన్నిటికీ కారణం అధిక బరువు అని గ్రహించాలి.

if you have diabetes then these might be the reasons

ఈ అధికబరువు సమస్యను అధిగమించాలంటే, సరియైన ఆహారం, అంటే ఆకు కూరలు, పండ్లు ప్రతిదినం తినాలి. కొవ్వు, కేలరీలు అధికంగా వున్న ఆహారం తీసుకోరాదు. ప్రతిదినం ఏదో ఒకరకమైన శారీరక వ్యాయామం కనీసం ఒక గంట చేయాలి. మన రక్తపోటు, కొల్లెస్టరాల్, బ్లడ్ షుగర్ వంటి వాటిపై నిరంతర నియంత్రణ వుండాలి.

Admin

Recent Posts