చాలామంది మహిళలకు బహిష్టు సమయంలో వ్యక్తిగత శుభ్రతనేది కొంచెం ఇబ్బంది కలిగించేదిగా వుంటుంది. స్నానం నుండి గుడ్డలు ఉతికి ఆరవేయటం వరకు శరీర శుభ్రత నుండి ఆరోగ్యం కాపాడుకోవటం వరకు కొన్ని చిట్కాలు కావాలి. మహిళలు, ప్రత్యేకించి కాలేజీకి వెళ్లేవారులేదా ఉద్యోగాలకెళ్ళేవారు తరచుగా రుతుక్రమంలో వ్యక్తిగత శుభ్రత సమస్యలు ఎదుర్కొంటారు. మురికిగా వుండే విశ్రాంతిగదులు, నీటి సమస్యలు, టాయ్ లెట్ పేపర్ లేకపోవడం మొదలైన వారి అవసరాలు సమకూరవు.
రుతుక్రమ సమయంలో సరైన శుభ్రత లేకుంటే వారికి ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం వుంది. అటువంటి వారికవసరమైన కొన్ని చిట్కాలు దిగువ ఇస్తున్నాం పరిశీలించండి. మీ హేండ్ బేగ్ లో ఏమేమి వుండాలి? – పేపర్ టవల్స్, శానిటరీ పాడ్లు, నీరు, చాక్లెట్లు, పెయిన్ కిల్లర్స్ (ఎమర్జెన్సీలో మాత్రమే) వుండాలి. పేపర్ టవల్స్ శుభ్రతకు శానిటైజర్లు చేతులు కడుగుటకు, మంచి వాసనకు, ప్యాడ్లు మార్చుకొనుటకు, నీరు, చాక్లెట్లు మీరు శక్తివంతంగా భావించటానికి, పెయిన్ కిల్లర్స్ కడుపులో బాగా నొప్పి వస్తే వేయటానికిగాను వుండాలి.
టాయ్ లెట్ లో ని కమ్మోడ్ అంచు ఎపుడూ ముట్టుకోకండి అది పూర్తిగా క్రిములతో నిండి వుంటుంది. టాయ్ లెట్ పేపర్ తో తుడిచి దానిని వాడండి. ఫ్లష్ నాబ్ ను ముట్టుకోవాలన్నా టాయ్ లెట్ పేపర్ ఉపయోగించండి. శుభ్రత వుండాలి కనుక శానిటరీ ప్యాడ్లు ఎన్ని ఉపయోగించామనేది లెక్కించకండి. కొద్ది గంటలు వాడేసి పారవేయండి. లేదంటే చర్మం మంటపెడుతుంది. మరకలు పడ్డ గుడ్డలుంటే వేడినీటితో నానపెట్టి శుభ్రం చేయండి. బట్టలను వీలైనంత త్వరగా శుభ్రం చేయకపోతే వాసన కొట్టేప్రమాదముంది. ప్రతి నెలా అయ్యే ఈ రుతుక్రమానికిగాను ప్రత్యేక దుస్తులు వుంచుకోండి. అపుడు క్రిములు ఇతర బట్టలకు వ్యాప్తి చెందకుండా వుంటాయి.