హెల్త్ టిప్స్

Tulsi Seeds : షుగ‌ర్ ఉన్న‌వారు ఈ గింజ‌ల‌ను త‌ప్ప‌నిసరిగా తినాలి.. ఎందుకంటే..?

Tulsi Seeds : తులసి గింజల వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని, చాలామందికి తెలియదు. తులసి గింజల్ని కచ్చితంగా తీసుకోండి. ఈ గింజల్ని తీసుకుంటే, చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. డిప్రెషన్, ఒత్తడి వంటి బాధల్ని కూడా తులసి గింజలు తొలగిస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళు తులసిగింజలని తీసుకుంటే, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని, ఇది నియంత్రిస్తుంది. తులసి గింజలని నీళ్ళల్లో వేసి తీసుకోవచ్చు. లేదంటే, స్నాక్స్ ఏమైనాతయారుచేసి వేసుకోవచ్చు.

చక్కెర నియంత్రించడంలో తులసి గింజలు, బాగా పనిచేస్తాయి. తులసి గింజలని తీసుకుంటే, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. పైగా, తులసి గింజలు గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్ కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు, తులసి గింజలను తీసుకోవడం వలన జీర్ణక్రియ బాగుండడమే కాకుండా, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. ఫైబర్ ఉన్న ఆహారాలు చక్కెరని నిర్వహించడానికి, చక్కగా పనిచేస్తాయి.

if you have diabetes then you must take tulsi seeds

టైప్ వన్ డయాబెటీస్, టైప్ టు డయాబెటీస్ ఉంటే, తులసి గింజల్ని తీసుకోండి. తులసి గింజలను తీసుకుంటే, బరువు కంట్రోల్లో ఉంటుంది. అలానే, తులసి గింజలను తీసుకోవడం వలన, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. శక్తిని కూడా తులసి గింజలు పెంచగలవు. ప్రతి ఒక్కరి ఇంట్లో, తులసి మొక్క ఉంటుంది. కాబట్టి ఈ గింజలు మనకు ఈజీగానే దొరుకుతాయి. సులభంగా మనం తులసి గింజల్ని తీసుకోవచ్చు.

తులసి గింజలు తీసుకుంటే, జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. తులసి గింజల్ని ముందు నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఈ నీళ్ళని గింజలతో పాటుగా పూర్తిగా నానిన తరవాత తీసుకుంటే, జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అలానే, ఇతర లాభాలు ఎన్నో పొందవచ్చు. తులసి ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివే. వాటిని కూడా తీసుకోవచ్చు. తులసిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఆయుర్వేద వైద్యంలో కూడా వాడుతూ ఉంటారు.

Share
Admin

Recent Posts