Gas Trouble : ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యానికి హాని చేసే రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. దాంతో అధిక బరువు పెరిగిపోవడం, గ్యాస్, ఉదర సంబంధిత సమస్యలు ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య గ్యాస్. గ్యాస్ నొప్పి వలన ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అటువంటి సమస్య నుండి సులభంగా బయటపడాలంటే ఇలా చేయండి.
వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్యం కంటే ప్రతి ఒక్కరు కూడా రుచికి ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యానికి హాని చేసే వాటిని మాత్రమే కోరుకుంటున్నారు. అటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఎక్కువ గ్యాస్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. చాలా మంది ఇటువంటి సమస్యల్ని ఎదుర్కోవడం వలన గ్యాస్ టాబ్లెట్లను వేసుకుంటూ ఉంటారు.
గ్యాస్ బయటకి రిలీజ్ అవ్వకుండా పట్టేసి ఛాతి నొప్పి లేదంటే కడుపులో నొప్పి, కడుపులో ఇబ్బందిగా ఉండడం వంటివి కలిగినప్పుడు సహజంగా ఇలా తొలగించుకోవచ్చు. వాము చాలా చక్కగా పనిచేస్తుంది. వాము గ్యాస్ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతుంది. అయితే దీనిని ఎలా తీసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే.. పొయ్యి మీద ఒక గ్లాసు నీళ్ళని బాగా మరిగించండి. అందులో వాము వేసుకోండి. ఒక పావు స్పూన్ లేదా అర స్పూన్ వరకు మీరు వామును వేసుకోవచ్చు.
బాగా మరిగించి వాముతోపాటు ఆ నీళ్ళని మొత్తం తీసుకోవచ్చు. కాఫీని తాగినట్లు వేడివేడిగా ఈ నీళ్ళని తాగడం వలన చక్కటి ప్రయోజనాన్ని పొందొచ్చు. వేడిగా మాత్రమే దీనిని తీసుకోవాలి. వెంటనే గ్యాస్ ని బ్యాలెన్స్ చేయగలదు. గ్యాస్ వలన కలిగే ఇబ్బందులు అన్నీ కూడా క్షణాల్లో దూరమైపోతాయి. గ్యాస్ బాధ నుండి త్వరగా బయటపడొచ్చు. మీరు మరిగించుకుని ఈ నీళ్లను చేసుకునే టైం లేకపోయినా, ప్రయాణాల్లో వున్నా కొంచెం వాముని తీసుకొని నమిలితే సరిపోతుంది. అలా కూడా ఈ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు.