పెద్దవారిలో వచ్చినట్లే పిల్లలలో కూడా డయాబెటీస్ వస్తుంది. అయితే, పిల్లలలో సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ కనపడుతూంటుంది. అయితే, మారుతున్న జీవన శైలి కారణంగా, నేటి రోజుల్లో పిల్లలలో సైతం అతి సాధారణంగా పెద్దలలో వచ్చే టైప్ 2డయాబెటీస్ ను కనుగొంటున్నాం. డయాబెటీస్ మా పిల్లాడికే ఎందుకు రావాలి? అనుకుంటారు. మీ బిడ్డే దానికి గురికావటం దురదృష్టం. బాల్యదశలో ఈ షుగర్ ఎందుకు వస్తుందనేది పూర్తిగా అవగాహనకి రాలేదు.
డయాబెటీస్, వంశానుగతంగా లేదా వ్యాధినిరోధకత తగ్గిన కారణంగా లేదా పర్యావరణ ప్రభావంగా వస్తుంది. కొన్ని కేసులలో పాన్ క్రియాస్ గ్రంధిలో ఉత్పత్తి అయే ఇన్సులిన్ ను నాశనం చేసే వైరల్ ఇన్ ఫెక్షన్ వలన కూడా వస్తూంటుంది. చాలా కేసుల్లో ఈ నాశనం శాశ్వతంగా వుండి పిల్లాడు జీవితాంతం ఇన్సులిన్ పై ఆధారపడవలసే వుంటుంది.
ఇన్సులిన్ తప్పక తీసుకోవాలా? అవును, టైప్ 1 డయాబెటీస్ లో తప్పక తీసుకోవాల్సిందే. ఇన్సులిన్ ఇవ్వకుంటే, పిల్లాడు ప్రమాద కరమైన డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఎప్పటినుండి మొదలు పెట్టాలి? బాల్యదశ డయాబెటీస్ కు రోగ నిర్ధారణ అయినప్పటినుండి ఇంజెక్షన్ తీసుకోవాల్సిందే. సుమారు 8 సంవత్సరాల వయసు నుండే మీ పిల్లాడు ఇంజక్షన్ తీసుకోవలసివుంటుంది.