చాలామంది ఎప్పుడూ తల పట్టుకొని కూర్చుంటారు. ఏమైంది అని అడిగితే మూడ్ బాగోలేదు అంటారు. చాలా చిరాకుగా ఉంటారు. కోపంతో ఉంటారు. ఒత్తిడిలో ఉంటారు. ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవాళ్లు… మూడ్ బాగోలేదు అంటూ చెబుతుంటారు. ఇలా అయినదానికి.. కానిదానికి మూడ్ బాగోలేదు అని చెప్పేవాళ్లు కాస్త ఆలోచించాల్సిందేనట. వాళ్లకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చని.. అందుకే వాళ్ల మూడ్ బాగుండదని పరిశోధకులు చెబుతున్నారు.
మూడ్ బాగోలేకపోవడం.. అనారోగ్యానికి సంకేతమట. ఇలా ఎప్పుడూ మూడ్ బాగుండని వాళ్లు చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారట. వాళ్లకు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కేన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయట.
అందుకే.. తరుచుగా మూడ్ బాగుండకపోతే వెంటనే వెళ్లి డాక్టర్ ను కలవడం బెటర్ అంటూ పరిశోధకులు చెబుతున్నారు.