హెల్త్ టిప్స్

ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం.. ఏ దిక్కున త‌ల‌ను ఉంచి నిద్రిస్తే మంచిదో తెలుసా ?

నిద్ర అనేది మ‌న శ‌రీరానికి రోజూ అవ‌స‌రం. రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌క‌పోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. స‌రైన దిక్కుకు త‌ల‌పెట్టి నిద్రించ‌డం కూడా అంతే అవ‌స‌రం. లేదంటే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ఆయుర్వేద, వాస్తు శాస్త్రం చెబుతున్న ప్ర‌కారం ద‌క్షిణం, లేదా తూర్పు వైపు త‌ల ఉంచి నిద్రించాలి. ప‌డ‌మ‌ర‌, ఉత్తరం దిక్కుల్లో త‌ల‌ను ఉంచి నిద్రించ‌రాదు. ఎందుకంటే..

in which direction you have to put your head according to ayurveda and vastu

భూమికి రెండు ధృవాలు ఉంటాయి. ఒక‌టి ఉత్త‌ర ధృవం, రెండోది ద‌క్షిణ ధృవం. ఉత్త‌రం వైపు మాగ్నెటిక్ పాజిటివ్ ప్ర‌భావం ఉంటుంది. ద‌క్షిణం వైపు మాగ్నెటిక్ నెగెటివ్ ప్ర‌భావం ఉంటుంది. ఇక మ‌న త‌ల‌ను పాజిటివ్ అని, కాళ్ల‌ను నెగెటివ్ అని చెబుతారు. ఈ క్ర‌మంలో త‌ల‌ను ఉత్త‌రం వైపుకు పెడితే త‌ల‌, ఉత్త‌రం దిక్కు రెండూ పాజిటివ్ క‌నుక.. మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వాస్తు ప్ర‌కారం అశుభం క‌లుగుతుంది. క‌నుక ఉత్త‌రం దిక్కున త‌ల‌ను ఉంచ‌రాదు.

ఇక ప‌డ‌మ‌ర దిక్కున త‌ల ఉంచి నిద్రించ‌డం వ‌ల్ల పీడ‌క‌ల‌లు వ‌స్తాయ‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా చేయ‌డం వ‌ల్ల అరిష్టం కూడా క‌లుగుతుంద‌ట‌. క‌నుక ద‌క్షిణం లేదా తూర్పు వైపు త‌ల‌ను ఉంచి నిద్రించాల్సి ఉంటుంది.

Share
Admin

Recent Posts