హెల్త్ టిప్స్

మనిషికి కనీసం 8 గంటలు నిద్ర సరిపోతుందా….?

పగటి పూట నిద్ర అలవాటు ఉండేవారు అది మానకూడదు. రాత్రి ఎక్కువ సమయం మెలకువగా ఉండకూడదు. అన్నం తినకముందు నిద్రపోవచ్చు. స్త్రీ సంభోగం, ఎక్కువ దూరం ప్రయాణం, ఎక్కిళ్ళు విరోచనాలు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నిద్రించవచ్చు. రాత్రి పాలు తాగి నిద్రించేవాళ్ళకి మంచి సుఖం నిద్ర పడుతుంది. చిన్నపిల్లలు, 63 సంవత్సరాలు దాటిన ముసలివాళ్ళు ఎప్పుడైనా, ఎంతసేపైనా నిద్రపోవచ్చు.

ప్రతీ మనిషికి కనీసం రాత్రి సమయంలో ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. యోగ సాధన, ప్రార్థన మనఃపూర్వకంగా చేసే వారికి ఆరుగంటలు నిద్ర చాలు. బి.పి, షుగరువ్యాధిలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర కోసం మత్తు పదార్థాలు, నిద్రమాత్రలు అలవాటు చేసుకోవడం మంచిది కాదు.

is 8 hours sleep is enough for us

ఎందుకంటే వాటిని తరచుగా వాడటంవల్ల స్తబ్ధత, బద్ధకం వస్తాయని పరిశోధనలో తేలింది. మనం ఎన్నెన్నో సమస్యలు మానసిక ఒత్తిళ్ళు, అనేక ఆలోచనలతో నిద్రపోతాం. ఈ ఒత్తిడులన్నీ ముందే వదిలించుకొని యోగాభ్యాసంతో నిద్రించే నిద్ర, యోగనిద్ర ఇది ఆరోగ్యకరమైనది.

నిద్రకు ఉపక్రమించే ముందు పోరాటం, యుద్ధం, భయంకర దృశ్యాల కథలు కాకుండా ఆహ్లాదభరితమైన పుస్తకం పడుకునే ముందు చదవటం అలవాటు చేసుకుంటే చక్కటి నిద్రవస్తుంది.

Admin

Recent Posts