Toddy : క‌ల్లు తాగితే మంచిదేనా..? విస్తుగొలుపుతున్న నిజాలు..!

Toddy : తాటి క‌ల్లు.. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది క‌ల్లు తాటి చెట్టు నుండి వ‌చ్చిన పానీయ‌మే క‌దా దీనిని తాగితే చాలా మంచిది అని భావిస్తూ ఉంటారు. అస‌లు క‌ల్లు మంచిదా.. కాదా.. దీనిని తాగ‌వ‌చ్చా, తాగ‌కూడ‌దా..అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తాటి చెట్టు నుండి వ‌చ్చిన పానీయాన్ని 12 గంట‌ల లోపు తాగితే దానిని నీరా అంటారు. 12 గంట‌ల లోపు తాగితే ఇందులో ఎటువంటి మ‌త్తు ప‌దార్థం అభివృద్ధి చెంద‌దు. 100 ఎమ్ ఎల్ నీరాలో 75 క్యాల‌రీల శ‌క్తి, 15 శాతం పిండి ప‌దార్థాలు ఉంటాయి. ఈ పిండి ప‌దార్థాలు సుక్రోజ్ రూపంలో ఉంటాయి. క‌నుక ర‌క్తంలో త్వ‌ర‌గా క‌ల‌వ‌వు.

దీంతో షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు కూడా ఈ నీరాను తాగ‌వ‌చ్చు. అలాగే ఈ నీరాను తాగ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా తాటి చెట్టు నుండి తీసిన నీరాను తాగితే ఎటువంటి దోష‌ము క‌ల‌గ‌దు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ నీరాను 12 గంట‌ల త‌రువాత నిల్వ ఉంచిన కొద్ది ఇది పులిసి క‌ల్లుగా మారుతుంది. ఈ క‌ల్లుల్లో 4 నుండి 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అలాగే ఈ క‌ల్లు అతిగా పుల‌వకుండా నిల్వ ఉండ‌డానికి దీనికి క్యాల్షియం హైడ్రాక్సైడ్ అనే ర‌సాయ‌న్ని క‌లుపుతారు. అలాగే ఈ క‌ల్లు మ‌రింత మ‌త్తుగా ఉండ‌డానికి దీనిలో ఈస్ట్ ను, పంచ‌దార‌ను కూడా క‌లుపుతారు.

is drinking Toddy healthy to us or what
Toddy

ఈస్ట్ పంచ‌దార‌ను, పిండి ప‌దార్థాల‌ను తినేస్తూ ఆల్క‌హాల్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో క‌ల్లు మ‌రింత మ‌త్తుగా ఉంటుంది. ఆల్క‌హాల్ శాతం 8 నుండి 10 వ‌ర‌కు పెరుగుతుంది. క‌ల్లును కూడా మ‌త్తుగా చేసి చాలా మంది అమ్ముతూ ఉంటారు. ఈ విధ‌మైన క‌ల్లును తాగ‌డం వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఇలా మ‌త్తుగా ఉండే క‌ల్లును తాగడం వ‌ల్ల న‌రాల వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. అలాగే ఈ క‌ల్లులో చెడు బ్యాక్టీరియాలు పెరిగి మంచి బ్యాక్టీరియాలు త‌గ్గుతాయి. మ‌త్తుగా ఉండే క‌ల్లును తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. క‌ల్లు స‌హ‌జ సిద్దంగా ల‌భించే క‌దా దీనిని తాగితే ఆరోగ్యానికి మంచిదే క‌దా అని అనుకుంటారు.

కానీ ఇలా పులియ‌బెట్టిన‌, ర‌సాయ‌నాలు క‌లిపిన క‌ల్లే మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. తాటి చెట్టు నుండి తీసిన నీరాను 12 గంట‌ల లోపు తాగితేనే మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని 12 గంట‌లు దాటిన త‌రువాత తాగే క‌ల్లు మ‌న ఆరోగ్యానికి కీడును క‌లిగిస్తుందని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts