పాప్‌కార్న్ సహజంగానే మనకు బయట చిరుతిండిలా లభిస్తుంది. కనుక వాటిని అనారోగ్యకరమైనవని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. పాప్‌కార్న్ అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. వాటిని తినడం వల్ల లాభాలే కలుగుతాయి. స్నాక్స్ బదులుగా పాప్‌కార్న్‌ను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాప్‌కార్న్‌ను మొక్కజొన్న విత్తనాల నుంచి తయారు చేస్తారు. కనుక పాప్‌కార్న్ చాలా ఆరోగ్యకరమైనవి. పాప్‌కార్న్‌కు ఉపయోగించే మొక్కజొన్న విత్తనాలు వేరేగా ఉంటాయి. అందువల్ల పాప్‌కార్న్‌లో అనేక పోషకాలు ఉంటాయి. పాప్‌కార్న్‌లో విటమిన్లు బి1, బి3, బి6, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. శక్తి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటాం.
2. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. ఇవి కణాలకు హాని చేస్తాయి. కనుక పాప్‌కార్న్‌ను తింటే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేయవచ్చు. దీంతో కణాలు సురక్షితంగా ఉంటాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. పలు అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
3. ఫైబర్ అత్యంత ఎక్కువగా ఉండే ఆహారాల్లో పాప్‌కార్న్ ఒకటి. అందువల్ల పాప్‌కార్న్ ను తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ సమస్యలు రావు. మనకు రోజూ 25 నుంచి 35 గ్రాముల వరకు ఫైబర్ అవుతుంది. ఈ క్రమంలో కేవలం 100 గ్రాముల పాప్‌కార్న్ ను తినడం వల్ల 15 గ్రాముల వరకు ఫైబర్ లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
4. అధిక బరువు తగ్గాలనుకునే వారికి పాప్‌కార్న్ ఉత్తమమైన ఆహారం. ఇందులో ఉండే ఫైబర్ అధిక బరువు తగ్గేలా చేస్తుంది.
అయితే పాప్‌కార్న్‌ను మైక్రోవేవ్‌లో తయారు చేయరాదు. సహజసిద్ధంగా తయారు చేయాలి. పాప్‌కార్న్ తయారీలో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వాడితే ఇంకా మంచిది. ఉప్పు రుచి కోసం వేసుకోవచ్చు. అవసరం అయితే ఫ్లేవర్ కోసం నెయ్యి వాడవచ్చు. ఇలా పాప్‌కార్న్ ను తయారు చేసి తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.