Isabgol With Milk : సైలియం పొట్టు.. దీనినే ఇసాబ్గోల్ అని కూడా పిలుస్తారు. ఒవాకా అనే చెట్టు విత్తనాల నుండి దీనిని తయారు చేస్తారు. ఇసాబ్గోల్ అనేక ఔషధ గుణాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ముఖ్యంగా మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఇసాబ్గోల్ ను పాలతో కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇసాబ్గోల్ ను పాలతో కలిపి తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇసాబ్గోల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మలబద్దకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇసాబ్గోల్ ను పాలతో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అనగా కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
ఇసాబ్గోల్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం సహజంగా ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే ఇసాబ్గోల్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధులు, ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. ఇసాబ్గోల్ ను తీసుకోవడం వల్ల ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్ ( ఐబిఎస్) సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ సమస్య వల్ల కలిగే పొత్తి కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా ఇసాబ్గోల్ మనకు సహాయపడుతుంది. పాలతో కలిపి దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువును అదుపులో ఉంచడంలో కూడా ఇసాబ్గోల్ మనకు సహాయపడుతుంది. దీనిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది.
త్వరగా మనం తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఇసాబ్గోల్ ను తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియను మెరుగుపరచడంలో ఇసాబ్గోల్ మనకు సహాయపడుతుంది. ఇసాబ్గోల్ ను తీసుకోవడం వల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. ఈ విధంగా ఇసాబ్గోల్ ను పాలతో కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని దీనిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.