Jaggery With Curd : పెరుగులో బెల్లం క‌లిపి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Jaggery With Curd : మ‌నం ప్ర‌తిరోజూ పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. పెరుగులో అనేక పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయన్నా సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. పెరుగును అన్నంతో క‌లిపి తీసుకుంటూ ఉంటాము. అలాగే కొంద‌రు పెరుగులో పంచ‌దార, ఉప్పు క‌లిపి నేరుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవ‌డం కంటే పెరుగులో బెల్లం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగు, బెల్లం కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అనేక ర‌కాల అంటు రోగాలు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అలాగే పెరుగు, బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సినంత క్యాల్షియం ల‌భిస్తుంది. దంతాలు, ఎముకలు బ‌లంగా త‌యార‌వుతాయి. శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. గుండెకు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పెరుగును, బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే పెరుగును, బెల్లాన్నిక‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నొప్పి స‌మ‌స్య త‌గ్గుతుంది. పొట్ట‌లో, ప్రేగులల్లో మేలు చేసే బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది.

Jaggery With Curd many wonderful health benefits
Jaggery With Curd

అదేవిధంగా ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డే వారు పెరుగు, బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి రెండు కూడా మ‌న‌కు తోడ్ప‌డుతాయి. పెరుగును, బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. దీంతో మ‌నం ఇత‌ర ఆహారాల వైపు మ‌న దృష్టి వెళ్ల‌కుండా ఉంటుంది. అలాగే పెరుగును, బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌తో పాటు శ‌క్తి కూడా ల‌భిస్తుంది. శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త‌, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతాము.

అదేవిధంగా జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు పెరుగు, బెల్లంతో పాటు కొద్దిగా మిరియాల పొడి క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అయితే పెరుగు, బెల్లాన్ని క‌లిపి తీసుకోవాల‌నుకునే వారు మ‌ధ్యాహ్నం భోజనం చేసిన త‌రువాత తీసుకోవాలి. రాత్రి స‌మ‌యంలో తీసుకోకూడదు. రాత్రి స‌మ‌యంలో తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ విధంగా పెరుగును, బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని దీనిని ఎవ‌రైనా తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts