Jaggery With Warm Water : పరగడుపున బెల్లం తిని ఒక్క గ్లాసు వేడి నీరు తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Jaggery With Warm Water : బెల్లం.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డంతో పాటు దీనితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెల్లంతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బెల్లంతో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అయితే బెల్లాన్ని ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది.. బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ప‌ర‌గ‌డుపున ఒక చిన్న నిమ్మ‌కాయంత బెల్లం ముక్క‌ను తిని వెంట‌నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి. అలాగే తెల్ల బెల్లాన్ని అస్స‌లు ఉప‌యోగించ‌కూడ‌దు.

బ్రౌన్ క‌ల‌ర్ లో ఉండే బెల్లాన్ని మాత్ర‌మే తీసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ది అవుతుంది. మ‌న శ‌రీరంలో 150 కు పైగా అనారోగ్య స‌మ‌స్య‌లు ర‌క్తం పాడ‌వ‌డం వ‌ల్ల వ‌స్తాయి. బెల్లం తిన‌డం వ‌ల్ల దీనిలో ఉండే ఫాస్ప‌ర‌స్ ర‌క్తాన్ని శుద్ది చేస్తుంది. దీంతో మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. బెల్లం ముక్క‌ను తిని గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డి మ‌నం తిన్న ఆహారం చ‌క్క‌గా జీర్ణ‌మ‌వుతుంది. దీంతో మ‌న శ‌రీరానికి పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. ఈ విధంగా బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Jaggery With Warm Water take on empty stomach
Jaggery With Warm Water

చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బెల్లాన్ని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ చురుకుగా పని చేస్తుంది. ఈ విధంగా రోజూ ఉద‌యాన్నే ఒక చిన్న బెల్లం ముక్క‌ను తిని గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts