Jonna Ambali Benefits : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. ఎంతో కాలంగా వీటిని మనం ఆహారంగా తీసుకుంటున్నాము. జొన్నలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నా సంగతి మనకు తెలిసిందే. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడవచ్చు. చాలా మంది వీటిని పిండిగా, రవ్వగా చేసి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా రొట్టె, అన్నం, ఇడ్లీ, ఉప్మా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా జొన్న పిండితో మనం అంబలి కూడా తయారు చేసుకోవచ్చు. జొన్న అంబలి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ అంబలిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా జొన్న అంబలిని తయారు చేసి తీసుకోవచ్చు. జొన్న అంబలిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని వేయాలి.తరువాత 3 గ్లాసుల నీళ్లు పోసి బాగా కలపాలి. ఇందులోనే తగినంత సైంధవ లవణం వేసి కలపాలి. ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి కలుపుతూ ఉడికించాలి. దీనిని 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని గ్లాస్ లో పోసి అందులో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న అంబలి తయారవుతుంది. ఈ అంబలి తాగడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
రోజంతా ఉత్సాహాంగా పని చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ అంబలిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జొన్న అంబలిని తీసుకోవడం వల్లశరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అంబలిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.షుగర్ తో బాధపడే వారు ఈ అంబలిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ అంబలిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ అంబలిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ అంబలిని తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ అంబలిని ఎవరైనా తీసుకోవచ్చు. ఇలా జొన్న పిండితో అంబలిని చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.