Kalonji Seeds Tea : ఈ రెండు పదార్థాలను కలిపి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అధిక బరువు, షుగర్, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం, కండరాల నొప్పులు వంటి అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వాత రోగాలన్నీ తగ్గు ముఖం పడతాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆ రెండు పదార్థాలు ఏమిటి.. వాటిని ఎలా తీసుకోవాలి.. అలాగే వాటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా కాళోంజి విత్తనాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మన శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగుపడడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. కలోంజి విత్తనాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలన్నీ తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కఫం, ఆస్థమా, శ్లేష్మం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అదే విధంగా మనం ఉపయోగించాల్సిన మరో పదార్థం వాము. ఇది మనందరికి తెలిసిందే. వామును ఉపయోగించడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, గుండెకు బలాన్ని చేకూర్చడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో, శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలో వాము మనకు ఎంతో ఉపయోగపడుతుంది. వామును ఉపయోగించడం వల్ల శరీరంలో మెటబాలిజం స్థాయిలు పెరుగుతాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. అయితే వీటిని ఏ విధంగా తీసుకోవడం వల్ల మనకు మేలు చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం అర టీ స్పూన్ వామును, అర టీ స్పూన్ కాళోంజి విత్తనాలను తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసి ఒక గ్లాస్ నీటిని పోయాలి. తరువాత ఈ నీటిని మధ్యస్థ మంటపై అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టీ గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో తేనె లేదా బెల్లం వేసి కలిపి తాగాలి.
అయితే షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇందులో తేనె, బెల్లం వేసుకోకపోవడమే మంచిది. ఈ విధంగా ఈ నీటిని తాగడం వల్ల పైన చెప్పిన అనారోగ్య సమస్యలన్నింటిని మనం దూరం చేసుకోవచ్చు. అధిక బరువు, కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ చిట్కాను ఈ విధంగా వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వామును, మరియు కాళోంజి విత్తనాలను కలిపి తీసుకోవచ్చు. ఎటువంటి సమస్యలు లేని వారు పావు టీ స్పూన్ వామును, పావు టీ స్పూన్ కాళోంజి విత్తనాలను చపాతీ పిండిలో వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పిండితో చపాతీలు తయారు చేసి తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఈ విధంగా వాము, కాళోంజి విత్తనాలు మనకు ఎంతో మేలు చేస్తాయని వీటితో టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.