Knee Pain : మోకాళ్ల మధ్యలో జిగురు తగ్గిపోయి మోకాళ్ల నొప్పులతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ మోకాళ్ల నొప్పులను తట్టుకోలేక చాలా మంది శస్త్ర చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. వ్యాయామాలు చేయకపోవడం, ఒకే దగ్గర కూర్చుని చేసే ఉద్యోగాలు చేయడం వంటి వివిధ కారణాల చేత ఈ మోకాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల శస్త్ర చికిత్సతో అవసరం లేకుండా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని మోకాళ్ల మధ్య జిగురు ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాళ్లను కదిలించడం వల్ల మోకాళ్ల మధ్య వేడి పుడుతుంది. ఈ వేడి కారణంగా కార్టిలేజ్ దెబ్బతినకుండా ఉండడానికి ఈ భాగంలో జిగురు ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియ మన శరీరంలో సహజంగా జరుగుతుంది.
అయితే మోకాళ్లను కదిలించకుండా ఉండగడం వల్ల క్రమంగా జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో మోకాళ్ల నొప్పులు వస్తాయి. మనల్ని వేధించే ఈ మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే మనం వ్యాయామాలు చేయాలి. అయితే నడిచే వ్యాయామాలు చేయడం వల్ల మోకాళ్లపై బరువు ఎక్కువగా పడి నొప్పులు మరింత ఎక్కువవుతాయి. కనుక మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే వ్యాయామాలను చేయడం వల్ల కీళ్ల మధ్య జిగురు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడంతో పాటు నొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు రెండు లేదా మూడు కుర్చీలను వేసుకుని పాదాలు నేలకు ఆనకుండా వాటిపై కూర్చోవాలి. తరువాత కాళ్లను పైకి కిందికి అంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కాళ్లపై బరువు పడకుండా ఉంటుంది. అలాగే కండరాలు బలపడి నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు నేలపై నిటారుగా పడుకుని సైకిల్ తొక్కిన మాదిరి కాళ్లను గుండ్రంగా కదిలించాలి.
ఇలా వ్యాయామం చేయడం వల్ల కీళ్ల మధ్య జిగురు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడంతో పాటు మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే నేలపై నిటారుగా పడుకుని మోకాళ్లను దగ్గరికి తీసుకువచ్చి ఒక కాలిని పైకి నిటారుగా ఎత్తాలి. ఈ కాలిని కిందికి దించిన తరువాత మరో కాలిని పైకి ఎత్తి దించాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే నేలపై కూర్చుని కాళ్లను దగ్గరగా అనుకోవాలి. తరువాత రెండు కాళ్లను కొద్దిగా పైకెత్తి ఒకేసారి ముందుకు అంటూ మరలా దగ్గరికి అనుకుంటూ ఉండాలి. ఇలా రోజూ 4 వ్యాయామాలను చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటు ఆహారంలో మార్పు చేసుకోవాలి. ఉదయం మరియు సాయంత్రం కేవలం పండ్లనుమాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం ఉప్పు లేని కూరలను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా వ్యాయామాలు చేస్తూ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు క్రమంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.