రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌ మెద‌డుకు ఏం జ‌రుగుతుందో తెలుసా ?

రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. వ్యాయామం చేయ‌డం వల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. షుగ‌ర్ లెవ‌ల్స్, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే రోజూ వ్యాయామం చేయ‌డం వల్ల మెద‌డుకు కూడా ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. వ్యాయామం వ‌ల్ల మాన‌సికంగా మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌ మెద‌డుకు ఏం జ‌రుగుతుందో తెలుసా ?

1. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్‌, డోప‌మైన్‌, ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. వీటి వ‌ల్ల మూడ్ మారుతుంది. ఉత్సాహం ల‌భిస్తుంది. సంతోషంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు.

2. రోజూ మ‌నం అనేక సంద‌ర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. దీని వ‌ల్ల శ‌రీరంలో కార్టిసోల్ విడుద‌ల‌వుతుంది. ఇది మంచిది కాదు. అనారోగ్యాల‌ను తెచ్చి పెడుతుంది. అయితే రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కార్టిసోర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

3. నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారి నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మెద‌డు చురుగ్గా మారుతుంది. ఆలోచ‌నా శ‌క్తి పెరుగుతుంది.

5. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల ఎవ‌రికైనా స‌రే మ‌తిమ‌రుపు స‌మ‌స్య వ‌స్తుంటుంది. కానీ వ్యాయామం చేస్తే ఈ స‌మ‌స్య రాకుండా చూసుకోవ‌చ్చు.

Share
Admin

Recent Posts