Over Eating : దేన్న‌యినా స‌రే అతిగా తిన‌డం వ‌ల్ల ఎన్ని అన‌ర్థాలు సంభ‌విస్తాయో తెలుసా..?

Over Eating : మ‌నం మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి కొర‌కు ప్ర‌తిరోజూ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆహారాన్ని తీసుకుంటూనే మ‌నం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగ‌లుగుతాము. అయితే కొంద‌రు మాత్రం అవ‌స‌ర‌మైన దాని కంటే ఎక్కువ‌గా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. నియంత్ర‌ణ‌ను కోల్పోయి వీరు అదే ప‌నిగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. దీనినే ఈటింగ్ డిసార్డర్ గా నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారాన్ని అతిగా తీసుకోవ‌డం వెనుక అనేక కార‌ణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌ కారణంగా అలాగూ మాన‌సిక మ‌రియు శారీర‌క‌ప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల కూడా ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. అయితే కార‌ణాలేవైన‌ప్ప‌టికి అతిగా ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

అతిగా ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతిగా ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అధిక బ‌రువు క్ర‌మంగా ఊబ‌కాయానికి దారి తీసే అవ‌కాశం ఉంది. ఊబ‌కాయం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని స‌మ‌స్య‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే విధంగా అతిగా ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి, గ్యాస్, పొట్ట‌లో ఇబ్బందిగా ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అలాగే అతిగా ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మెట‌బాలిజానికి సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉంటాయి.

many side effects of Over Eating
Over Eating

మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ నిరోధ‌త‌క వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అదే విధంగా అతిగా తినే వారు ఆందోళ‌న‌, డిప్రెష‌న్, కుంగుబాటు వంటి స‌మ‌స్య‌ల‌తో కూడా బాధ‌ప‌డుతూ ఉంటార‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అలాగే అతిగా తినే వారు జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. దీంతో శ‌రీరంలో అధికంగా క్యాల‌రీలు వ‌చ్చి చేరుతాయి. అంతేకాకుండా పోష‌కాహార లోపం కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా త‌ర‌చూ అతిగా ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

అంతేకాకుండా అతిగా ఆహారాన్ని తీసుకునే వారిలో ఒక్కోసారి దుఖం, బాధ‌, అవ‌మానం వంటి భావాలు క‌లుగుతాయి. ఈ భావాలు మాన‌సిక ఆరోగ్యాన్ని మ‌రింత‌గా దెబ్బ‌తిస్తాయి. ఈ విధంగా అతిగా ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మాన‌సికంగా మ‌రియు శారీర‌కంగా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని క‌నుక ఆఈ అల‌వాట్ల నుండి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts