హెల్త్ టిప్స్

Coriander Leaves Juice : కొత్తిమీర జ్యూస్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే.. ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

Coriander Leaves Juice : కొత్తిమీరను నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. అనేక రకాల కూరల్లో కొత్తిమీరను వేస్తుంటారు. దీంతో చట్నీ, కూరలు చేసుకోవచ్చు. కానీ కొంద‌రు కొత్తిమీర అంటే ఇష్ట‌ప‌డ‌రు. పైగా కూర‌ల్లో వ‌స్తే తీసి ప‌డేస్తుంటారు. కానీ కొత్తిమీరను పోషకాలకు గని అని చెప్పవచ్చు. దీన్ని మ‌నం రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. కొత్తిమీర‌ను నేరుగా తిన‌లేమ‌ని అనుకునేవారు దాన్ని జ్యూస్‌లా చేసి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. రుచి కోసం కాస్త నిమ్మ‌ర‌సం, తేనె క‌లుపుకోవ‌చ్చు. ఇలా రోజూ పరగడుపునే కొత్తిమీర జ్యూస్‌ను తాగితే అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర జ్యూస్‌ను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ఈ సీజన్‌లో సహజంగానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ జ్యూస్‌ను తాగితే మంచిది. దీంతో ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. రోగాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇక కొత్తిమీరలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. కనుక రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. కాబ‌ట్టి కొత్తిమీర‌ను రోజూ త‌ప్ప‌క తినాలి. ఇక గాయాలు, పుండ్లు అయినవారు రోజూ కొత్తిమీర జ్యూస్‌ను తాగుతుంటే అవి త్వరగా మానుతాయి.

many wonderful health benefits of drinking coriander leaves juice daily

కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కొత్తిమీర‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. క‌నుక కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగాలి. అలాగే కొత్తిమీర జ్యూస్‌ను తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. అలాగే కొత్తిమీర‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. క‌నుక ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు దంతాలు, చిగుళ్ల‌ను దృఢంగా ఉంచుతుంది. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

కొత్తిమీర జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం అన్న స‌మ‌స్య‌లు ఉండ‌వు. జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. క‌నుక కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగితే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts