వినోదం

Viral Photo : స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన ఈ చిన్నారిని గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి ఫొటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వారి పిక్స్ చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. తాజగా తెలుగులో బాలనటిగా పలు సినిమాలు చేసి, ఆ త‌ర్వాత టీనేజ్ లోనే హీరోయిన్ గా మారి స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్‌కి సంబంధించిన చిన్న‌ప్ప‌టి ఫోటో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ సీరియ‌ల్స్ లో కూడా న‌టిస్తూ అల‌రిస్తుంది. ఆమె ఎవ‌రో గుర్తొచ్చిందా.. అల‌నాటి అందాల న‌టి రాశి. రాశి బాల‌న‌టిగా ఎన్నో పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. రాశీ జీవితం గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని విష‌యాలే చాలానే ఉన్నాయి.

రాశి అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి కాగా, ఆమె బాల్యంలో ఉన్న‌ప్ప‌టి నుంచే న‌ట‌నా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆమె పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ త‌ర్వాత స్టార్ హీరోల‌తో కూడా ఆమె సినిమాలు చేసింది. పెద్ద‌ల అంగీకారంతోనే ఆమె డైరెక్ట‌ర్ శ్రీనివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, శ్రీనివాస్‌ను ఆమె పెళ్లి చేసుకోవ‌డానికి ముందే మ‌రో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకుంది. రాశి ముందుగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అశోక్ సామ్రాట్‌ను 18 ఏళ్ల వ‌య‌స్సులోనే ప్రేమించింది. అయితే వీళ్ల ప్రేమ‌కు రాశి త‌ల్లిదండ్రులు ఒప్పుకోక‌పోవ‌డంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్ది రోజుల త‌ర్వాత మ‌న‌స్తాపానికి గురైన రాశి అత‌డికి దూర‌మైంది.

raasi childhood photo became viral

అనంత‌రం ఆమె మ‌న‌సిచ్చిచూడు ద‌ర్శ‌కుడు సురేష్‌వ‌ర్మ‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత అత‌డి చేతుల్లో కూడా రాశి మోస‌పోయింద‌ని , ముచ్చ‌ట‌గా మూడోసారి డైరెక్ట‌ర్ శ్రీనివాస్ ని పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకుంద‌ని చెబుతుంటారు. గిరిజ కళ్యాణం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ చేస్తోంది. ఇక ఈ అమ్మ‌డు గోకులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, సముద్రం, కృష్ణబాబు, మూడు ముక్కలాట, ఆమ్మో ఒకటో తారీఖు, సందడే సందడి లాంటి సూపర్ హిట్స్ సినిమాల‌లో న‌టించి మెప్పించింది.

Admin

Recent Posts