హెల్త్ టిప్స్

రోజూ 10 నిమిషాల పాటు బిగ్గ‌ర‌గా న‌వ్వితే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

నవ్వడం చాలా అవసరం అని తెలుసు. కానీ దాని వల్ల కలిగే లాభాలు చాలా మందికి తెలియవు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. మామూలుగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఎవరైనా సులువుగా కనిపెట్టేస్తారు. కొన్ని కొన్ని సార్లు నెగిటివ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తే మన చుట్టూ ఉన్న వారే మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అదే నవ్వుతూ ఉన్నారంటే ఇతరులు మనకి ఆకర్షితులవుతారు. ఎక్కువగా నవ్వడం వల్ల మన ఒత్తిడిని మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు నవ్వలేను అన్నట్టు అయితే ఫేక్ స్మైల్ ఇచ్చినా అది ఒత్తిడిని తగ్గిస్తుంది. నవ్వడం వల్ల మన మూడ్ కూడా మారిపోతుంది. నెగెటివ్ గా ఉంటే జస్ట్ ఒక నవ్వు వల్ల మారిపోతుంది.

నవ్వు అనేది ఇతరులకు సోకుతుంది కూడా. ఎప్పుడైనా మనం నవ్వుతూ ఆనందంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా అలానే ఫీలవుతారు. కాబట్టి మీరు నవ్వడం వల్ల ఇతరులు కూడా ఆనందంగా ఉండగలరు. నవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎక్కువగా మీరు నవ్వితే మీ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. నవ్వడం వల్ల మీరు మరింత మంచిగా ఉండొచ్చు. మీరు చాలా రిలాక్స్ గా ఉండొచ్చు. అలానే నవ్వడం వలన ఆనందంగా కూడా ఉండగలరు.

many wonderful health benefits of laughing daily for 10 minutes

ఎక్కువ సార్లు నవ్వడం వల్ల మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా ఉంచుతుంది. ఎక్కువగా నవ్వడం వల్ల మీరు విజయాల్ని అందుకోవడానికి కూడా ఉపయోగ పడుతుంది. నవ్వ‌డం వల్ల నెగిటివ్ దూరమైపోయి పాజిటివ్ గా ఉండొచ్చు. కాబట్టి నవ్వండి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. సమస్యల్ని పరిష్కరించుకోండి.

Admin

Recent Posts