హెల్త్ టిప్స్

ఆవాలే కదా అని ఏరేస్తున్నారా…? ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

ఆవాల‌ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఎందుకంటే నిత్యం మనం అందరం వంటల్లో వాడే ముఖ్యమైన తాలింపు దినుసు. వేడి నూనెలో ఆవాలు వెయ్యగానే చిటపట మని శబ్దం, వాటి నుంచి వచ్చే కమ్మని వాసన ఎవరికి తెలియనిది కాదు. అయితే ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆవాలు వంటింటి ఔషధంగా పనిచేస్తాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు అన్ని రకాల వయసుల వారికి సర్వసాధారణం అయిపోయాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిసి కీళ్లపై రాసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. పంటినొప్పితో బాధపడేవారు గోరు వెచ్చని నీటిలో కాసిన్ని ఆవాలు వేసి ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

many wonderful health benefits of mustard

ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి. చర్మంపై ఉన్న పులిపిర్లను తొలగించడానికి కూడా ఆవ పొడి బాగా పనిచేస్తుంది. ఆవ పొడిని మెత్తని పేస్ట్ చేసి దాన్ని రోజూ పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి. అంతే కాకుండా శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలకు ఆవ పొడి వాటిపై రాయడం ద్వారా అవి తగ్గిపోతాయి.

Admin

Recent Posts