Masala Tea : మనం చలికాలంలో ఎక్కువగా వేడి పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడతాము. వేడి పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి చలి నుండి రక్షణ లభిస్తుంది. చలికాలంలో మన శరీరానికి మరింత రక్షణ కల్పించే పానీయాల్లో మసాలా టీ ఒకటి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, కుంకుమపువ్వు, అల్లం వంటి మసాలాలతో చేసే ఈ మసాలా టీ ని తాగడం వల్ల చలి తీవత్ర తగ్గడంతో పాటు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. చలికాలంలో ఈ మసాలా టీని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మసాలా టీ ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా ఈ మసాలా టీ మనకు దోహదపడుతుంది . కెఫిన్ ఎక్కువగా ఉండే టీ లను తాగడానికి బదులుగా ఈ మసాలా టీని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చలికాలంలో మసాలా టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మసాలా టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెచండంలో తోడ్పడతాయి. తద్వారా వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన మనం పడకుండా ఉంటాము. ఈ మసాలా దినుసుల్లో ఉండే యాంటీ ఇన్ ప్లామేషన్ గుణాల కారణంగా మన శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ మసాలా టీ తయారీలో వాడిన లవంగాలు శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే ఈ మసాలా టీ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మసాలా టీ లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో ఎక్కువగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో, ఆకలిని నియంత్రించడంలో, శరీరంలో మెటబాలిజాన్ని పెంచడంలో ఈ టీ మనకు సహాయపడుతుంది. కనుక ఈ టీ ని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే చలికాలంలో మన శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ బలహీనపడుతుంది.
వేడి వేడిగా ఈ మసాలా టీని తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అలాగే చలికాలంలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. దీంతో జీర్ణ సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ సమయంలో మసాలా టీని తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవ్వడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటుంది. అలాగే ఈ మసాలా టీ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. కనుక ఈ టీని తాగడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. చలికాలంలో టీ, కాఫీలను తాగడానికి బదులుగా ఇలా మసాలా టీని తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.