Fruits : పండ్ల‌ను తిన్న వెంట‌నే నీటిని తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త.. ఎందుకంటే..?

Fruits : పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం ఆహారంగా అనేక ర‌కాల పండ్ల‌ను తీసుకుంటూ ఉంటాం. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు బ‌రువు కూడా పెర‌గ‌కుండా ఉంటాము. పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే పండ్ల ముక్క‌ల‌ను తిన్న త‌రువాత నీటిని తాగ‌కూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. పండ్ల ముక్క‌ల‌ను తిన్న వెంట‌నే నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో పాటు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. పండ్ల‌ను తిన్న త‌రువాత నీటిని తాగ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పండ్ల‌ను తిన్న త‌రువాత నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ నెమ్మ‌దిగా జ‌రుగుతుంది.

అజీర్తి స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే పండ్ల‌ల్లో ఉండే పోష‌కాలను ప్రేగులు గ్ర‌హించే ప్ర‌క్రియ ఆల‌స్య‌మ‌వుతుంది. అజీర్తి క్ర‌మంగా అసిడిటీకి దారి తీస్తుంది. దీంతో క‌డుపులో అసౌక‌ర్యంగా ఉంటుంది. పండ్లను తిన్న వెంట‌నే నీటిని తాగడం వ‌ల్ల జీర్ణ‌ర‌సాలు, ఎంజైమ్ ల ప‌నితీరు దెబ్బ‌తింటుంది. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు ఆటంకం క‌లుగుతుంది. ఇది తీవ్ర‌మైన అసిడిటీకి దారి తీస్తుంది. అలాగే పండ్ల‌ల్లో ఎక్కువ మొత్తంలో ఫ్ర‌క్టోజ్, ఈస్ట్ ఉంటాయి. పండ్ల‌ను తిన్న త‌రువాత నీటిని తాగ‌డం వ‌ల్ల పొట్ట‌లో ఆమ్లాలు ప‌లుచ‌బ‌డుతాయి. దీంతో కడుపులో ఈస్ట్ అభివృద్ధి చెంద‌డానికి చ‌క్క‌టి వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. దీని వ‌ల్ల పొట్ట‌లో గ్యాస్, నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అలాగే పండ్ల‌ను తిన్న త‌రువాత నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ నెమ్మ‌దిస్తుంది. దీంతో జీర్ణం కాని ప‌దార్థాలు కొవ్వుగా మార‌తాయి.

do not drink water after eating fruits know the reasons
Fruits

అలాగే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. పండ్ల‌ను తిన్న త‌రువాత నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌డంతో పాటు ఊబ‌కాయం కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా అధికంగా నీటిశాతం క‌లిగిన పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల పొట్ట‌లో పిహెచ్ స్థాయిల్లో అవ‌క‌త‌వ‌క‌లు వ‌స్తాయి. దీంతో క‌డుపులో నొప్పి, క‌డుపులో అసౌక‌ర్యంగా ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక పండ్ల‌ను తిన్న వెంట‌నే నీటిని తాగ‌కూడ‌దు. పండ్ల‌ను తిన్న గంట త‌రువాత మాత్ర‌మే నీటిని తాగాలి. ఇలా గంట త‌రువాత నీటిని తాగ‌డం వ‌ల్ల ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి. జీర్ణ‌క్రియ‌కు ఎటువంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉంటుంది. ఇలా పండ్ల‌ను తిన్న గంట త‌రువాత నీటిని తాగడం వ‌ల్ల పండ్ల‌ల్లో ఉండే పోష‌కాల‌న్నీ శ‌రీరానికి ల‌భిస్తాయి. పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌న్నింటిని మ‌నం పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts