Medicine : ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నానుడి మనందరికి తెలిసిందే. మనం ఏ పని చేసిన, చేయాలన్నా మన ఆరోగ్యం బాగుంటేనే చేయగలం. పని ఒత్తిడి వల్ల, కాలంలో వచ్చిన మార్పుల వల్ల, అప్పుడప్పుడు అనుకోని సందర్భాల వల్ల ఏదో ఒక రోగం మనకు వస్తూనే ఉంటుంది. ఉదాహరణకు పని ఒత్తిడి కారణంగా తలనొప్పి వచ్చిందే అనుకుందాం. తలనొప్పి తగ్గడానికి తలనొప్పిని తగ్గించే మాత్రలను వేసుకుంటాం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు చేయడం సహజం. జులుబును తగ్గించుకోవడానికి కూడా మాత్రలను ఉపయోగిస్తూ ఉంటాం. తలనొప్పి మనల్ని ఎంతో బాధిస్తూ ఉంటుంది. అలాంటి తలనొప్పిని తగ్గించడానికి మనం మాత్రలను ఉపయోగిస్తున్నాం. ఈ మాత్రలు ఎంత శక్తివంతమైనవో మనం ఆలోచించాలి.
తలనొప్పి మాత్రల వల్ల పెద్దగా దుష్ప్రభావాలు లేనప్పటికి కొందరూ అవసరం లేకుండానే మందులను ఉపయోగిస్తూ ఉంటారు. మన ఇంట్లో చిన్న పిల్లలకు కూడా ఏదో ఒక సమయంలో మాత్రలను ఇస్తూనే ఉంటాం. మందులను వాడడం వల్ల ఆ సమయంలో ఉపశమనం లభించవచ్చు. కానీ వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి మాత్రం ఎవరికి తెలియదు. అసలు ఆ మాత్రలను తట్టుకునే రోగ నిరోధక శక్తి మన శరీరానికి ఉందా.. అలా అని మందులను వాడకపోతే రోగం మరింత ముదిరే అవకాశం ఉంది. మందులను వాడితే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దీనికి ఏం చేయాలి. మందుల వల్ల దుష్ప్రభావాల బారిన పడకుండా ఉండాలంటే ముందులు వేసుకున్నప్పుడు కొబ్బరి నీటిని తాగడం చేయాలి.
కొబ్బరి నీటిని తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరి నీరు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవికాలంలో వచ్చే చెమట కాయలను దూరం చేసుకోవాలంటే కొబ్బరి నీటిని తాగాల్సిందే. దాహాన్ని తీర్చడయే కాక దీనిలో ఉండే మినరల్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కొబ్బరి నీరు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. కొబ్బరి నీటిలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీరు వేడిని తగ్గిస్తుంది. విరేచనాలను అరికడుతుంది. గుండె జబ్బులను తగ్గిస్తుంది.
కొబ్బరినీటితో పాటు తేనెను కలిపి తీసుకోవడం వల్ల అది సమర్థవంతమైన టానిక్ లా పని చేస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడిన వారు కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల వెంటనే తేరుకుంటారు. అంతేకాకుండా కడుపులో ఉండే హానికారక బ్యాక్టీరియాలను కూడా కొబ్బరి నీరు బయటకు పంపిస్తుంది. ఈ నీటిలో చక్కెరలు తగిన మోతాదులో ఉంటాయి. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా వీటిని తాగవచ్చు. అధిక బరువుతో బాధపడే వారు కొబ్బరి నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. మనం వాడే మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలను కూడా కొబ్బరి నీరు దూరం చేస్తుంది.
తరచూ మందులు వాడడం వల్ల వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను మనం అదుపు చేయలేము. మందులను ఎక్కువగా వాడే వారు కొబ్బరి నీటిని తీసుకున్నట్టయితే మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలను దూరం చేసుకోవచ్చు. మందులు వాడే వారు తప్పనిసరిగా కొబ్బరి నీటిని తీసుకోవాలి. ఈ కొబ్బరి నీరు మనకు ఏ కాలంలోనైనా దొరుకుతుంది. కనుక ఈ కొబ్బరి నీటిని క్రమం తప్పకుండా రోజుకు ఒక గ్లాస్ చొప్పునైనా తీసుకోవాలి. మందులు వాడే వారు కచ్చితంగా శరీరానికి తగినంత కొబ్బరి నీరు అందేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.