హెల్త్ టిప్స్

Cardamom : పురుషులు యాల‌కుల‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.. రోజూ ఈ స‌మ‌యంలో తినాలి..!

Cardamom : మ‌నం వంట‌ల త‌యారీలో సుగంధ ద్ర‌వ్యాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ సుగంధ ద్ర‌వ్యాల‌లో యాల‌కులు కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. యాల‌కులు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. యాల‌కులు అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయ‌ని ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌ల‌ల్లో రుజువైంది. ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా చాలా మంది దంప‌తులు లైంగిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.

చాలా మంది దంప‌తుల‌ను వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌ల్లో సంతాన‌లేమి స‌మ‌స్య ఒక‌టి. మ‌గ వారిలో వ‌చ్చే శృంగార స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో యాల‌కులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రోజూ రెండు యాల‌కుల‌ను తీసుకోవడం వ‌ల్ల మ‌గ వారిలో వీర్య క‌ణాల సంఖ్య పెరగ‌డంతోపాటు, శృంగారంలో ఎక్కువ స‌మ‌యం పాల్గొనే శ‌క్తి వ‌స్తుంది. అంతే కాకుండా న‌పుంస‌క‌త్వం కూడా త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా యాల‌కుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని వారు తెలియ‌జేస్తున్నారు.

men must take cardamom know the reasons

రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక యాల‌క్కాయ‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వు క‌రిగి త‌ద్వారా బ‌రువు త‌గ్గుతార‌ని నిపుణులు చెబుతున్నారు. ర‌క్తాన్ని శుద్ధి చేసి శ‌రీరంలోని మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో కూడా ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.వీటిని తిన‌డం వ‌ల్ల లేదా వాస‌న‌ను చూడ‌డం వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి త‌గ్గుతుంది. యాల‌కుల గింజ‌ల‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రించ‌డం వ‌ల్ల ఆక‌లి పెరుగుతుంది. నోట్లో ఇన్ ఫెక్ష‌న్ లు, నోటి దుర్వాస‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా యాల‌కులు స‌హాయ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Admin

Recent Posts