Menthulu : మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఆధిక బరువు బారిన పడడానికి చాలా రకాల కారణాలు ఉంటున్నాయి. బరువు అధికంగా ఉండడం వల్ల మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. బరువు తగ్గడానికి కొందరు ఆహార నియమాలను పాటిస్తారు. కొందరు వ్యాయామాలు చేస్తారు. కొందరు మార్కెట్ లో దొరికే బరువు తగ్గే సాధనాలను ఉపయోగిస్తారు. ఇవే కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా మనం బరువు తగ్గవచ్చు.
వంటింట్లో ఉపయోగించే మెంతులు మనకు బరువు తగ్గడంలో ఎంతో సహాయపడతాయి. ఇవి చేదుగా ఉంటాయనే కారణం చేత వీటిని మనం వంటింట్లో చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. మెంతి పొడిని కూడా మనం కూరల తయారీలో, పచ్చళ్ల తయారీలో వాడుతూ ఉంటాం. మెంతులు చేదుగా ఉంటాయే కానీ ఇవి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి మెంతులను ఏవిధంగా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతులు చేదుగా ఉంటాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వాంతి చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ చిట్కాను పాటించే ముందు తక్కువ మోతాదులో మెంతులను ఉపయోగించాల్సి ఉంటుంది. వీటి రుచి అలవాటు అయిన తరువాత ఎక్కువ మోతాదులో ఉపయోగించాలి. ఇందుకోసం ఒక పావు టీ స్పూన్ మెంతులను ఒక కప్పు నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపునే ఈ నీటిని తాగాలి. తరువాత కొద్ది కొద్దిగా ఈ నానబెట్టిన మెంతులను కూడా తినడం అలవాటు చేసుకోవాలి.
మెంతుల రుచికి అలవాటు పడిన తరువాత అర టీ స్పూన్ మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. అలాగే నానబెట్టిన మెంతులను కూడా తినాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల కొద్ది రోజులలోనే బరువు తగ్గడాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఈ విధంగా మెంతులను ఉపయోగించి మనం అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.